పెళ్లికి ముందే ఐశ్వర్యా రాయ్‌ కొడుకుని కన్నదా?, విడాకుల వార్తల నేపథ్యంలో షాకింగ్‌ విషయం బయటకు

First Published | Nov 2, 2024, 5:42 PM IST

ఐశ్వర్యా రాయ్‌కి కూతురు ఆరాధ్య మాత్రమే ఉంది. కానీ పెళ్లికి ముందే ఆమెకి కొడుకు పుట్టాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి అతనెవరు? ఆ కథేంటో చూస్తే.. 
 

ఐశ్వర్యా రాయ్‌.. ప్రపంచ సుందరిగా(మిస్‌ వరల్డ్ 1994 విన్నర్) అందరిని ఆకట్టుకుంది. తన గ్లామర్‌తో కట్టిపడేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. `ఇద్దరు`(ఇరువుర్-తమిళ్‌) సినిమాతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకుంది. చిత్ర పరిశ్రమలో హాట్‌ కేక్‌లా మారిపోయింది. దీంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ముఖ్యంగా హిందీలో ఎక్కువగా సినిమాలు చేసింది ఐశ్వర్య. అక్కడే విజయాలు అందుకుంది. తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌ ఎదిగింది.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

కొన్నాళ్లు బాలీవుడ్‌ని రూల్‌ చేసిన ఆమె బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కొడుకు, హీరో అభిషేక్‌ బచ్చన్‌తో ప్రేమాయణం నడిపించింది. అంతకు ముందు కూడా చాలా మంది హీరోలతో డేటింగ్‌లో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ చివరికి అభిషేక్‌ బచ్చన్‌ ఆమెని 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆరాధ్య(2011) జన్మించింది. ఆ క్యూట్‌ బేబీ ఇప్పుడు చాలా పెద్దగైపోయింది. ఇటీవల ముఖేష్‌ అంబానీ కొడుకు పెళ్లిలో తన కూతురుతో కలిసి ఐశ్వర్యా మెరిసింది. ఇందులో ఆరాధ్యని చూసి అంతా షాక్‌ అయ్యారు. తల్లిని మించిన అందంతో ఆకట్టుకుంది ఆరాధ్య. చూడబోతుంటే త్వరలోనే ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. 
 


ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌ విడిపోతున్నారనే రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. అంబానీ పెళ్లిలోనూ వీరు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. అంతేకాదు ప్రస్తుతం వేర్వేరుగానే నివసిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో వీరి డైవర్స్ రూమర్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇటు ఐష్‌గానీ, అటు అభిషేక్‌ గానీ స్పందించలేదు. ఇది కూడా ఈ రూమర్లకి బలాన్నీ చేకూరుస్తుంది. 
 

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ సంచలన వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఓ పాత విషయం అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఐశ్వర్యకి పెళ్లికి ముందే ఓ కొడుకు ఉన్నాడా? అనేది సంచలనంగా మారుతుంది. తాను ఐశ్వర్యా రాయ్‌ కొడుకుని అంటూ ఓ వ్యక్తి తెరపైకి రావడం షాకిస్తుంది. తాను ఐశ్వర్యా రాయ్‌ కొడుకుని అంటూ సంగీత్‌ కుమార్‌ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. అయితే ఇది మూడేళ్ల క్రితం విషయం. అప్పటికీ అతని వయసు 32. ఐశ్వర్య రాయ్‌ 15ఏళ్ల వయసులోనే తాను జన్మించినట్టు చెప్పాడు. లండన్‌లో `IVF-In Vitro Fertilization`(ల్యాబ్‌లో జన్మించడం) ద్వారా తాను జన్మించానని తెలిపారు. తనకు తల్లి ఐశ్వర్యా రాయ్‌ అంటూ ఆయన ఆరోపించారు. లండన్‌లో జన్మించిన తర్వాత వారి పేరెంట్స్ తనని వైజాగ్‌కి తీసుకొచ్చారని చెప్పాడు. 
 

ఐష్‌ తల్లిదండ్రులే తనని పెంచారని ఆయన ఆరోపించారు. అయితే తన పుట్టుకకి సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారని, ఇప్పుడు తన వద్ద ఏ ఆధారం లేదని చెప్పాడు. దీంతో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అతనెవరు? ఎందుకు అలా మాట్లాడుతున్నాడనేది విచారించగా, అతనికి మతిస్తిమితం లేదని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు విడాకుల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయం కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. మరోసారి హాట్‌ టాపిక్‌ గా మారుతుంది. 
 

ఇక ఐశ్వర్యా రాయ్‌ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. చివరగా ఆమె `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో నందిని పాత్రలో మెరిసింది. రెండు పాత్రల్లో అదరగొట్టింది. కథని మలుపుతి తిప్పే పాత్రలో అద్భుతంగా చేసి మెప్పించింది. అంతకు ముందు `ఫన్నీ ఖాన్‌` అనే బాలీవుడ్‌ మూవీ చేసింది. ఇలా చాలా సెలక్టీవ్‌గానే చేస్తుంది ఐష్‌. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు లేవని తెలుస్తుంది. 

Read more: పుట్టిన నాలుగు నెలలకే కూతురు చనిపోవడంతో శ్రీహరి ఏం చేశాడో తెలుసా?.. ఆ మూడు గ్రామాల పాలిట దేవుడు
 

Latest Videos

click me!