మహేష్, పవన్, నాగార్జున.. నార్త్ హీరోయిన్స్ ని భార్యలుగా ఎందుకు చేసుకున్నారో తెలుసా? షాకింగ్ రీజన్!

First Published | Nov 2, 2024, 6:00 PM IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియా హీరోయిన్స్ ని భార్యలుగా తెచ్చుకున్నారు. ఇందుకు కారణం ఏమిటో తెలుసా?
 

హీరోయిన్స్ ని వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే నార్త్ ఇండియాకు చెందిన హీరోయిన్స్ ని పెళ్లాడారు నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ఇది ఒకింత సాహసం అని చెప్పాలి. వారితో పోల్చితే మన కల్చర్, లైఫ్ స్టైల్, ట్రెడిషన్స్ వేరుగా ఉంటాయి. మనసులు కలిసినా పద్ధతులు, విధానాలు ముడిపడకపోతే మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అవేమీ పట్టించుకోకుండా వారు హిందీ, బెంగాలీ, గుజరాతీ హీరోయిన్స్ తో ఏడడుగులు వేశారు. అందుకు ఒక బలమైన కారణం ఉంది. 
 

కింగ్ నాగార్జున టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ప్రస్తుతం ఆయన హవా కొంచెం తగ్గింది కానీ...మూడు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ ఇచ్చారు. జయాపజయాలు పట్టించుకోకుండా ప్రయోగాలు చేశారు. కాగా నాగార్జున నార్త్ ఇండియా హీరోయిన్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెప్పాలంటే ఆమె విదేశీ అమ్మాయి కూడాను. 


నాగార్జున మొదటి వివాహంగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని చేసుకున్నారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం మనస్పర్ధలతో విడిపోయారు. అనంతరం 1992లో హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నారు. అమల తండ్రి బెంగాలీ కాగా తల్లిది ఐర్లాండ్. బెంగాలీ తండ్రి-ఐరిష్ మహిళకు పుట్టిన అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నారు. వీరి కొడుకు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అఖిల్ కి బ్రేక్ రావాల్సి ఉంది. 

కృష్ణ నటవారసుడు మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్లాప్ చిత్రాలు కూడా భారీ వసూళ్లు రాబడతాయి. నెక్స్ట్ ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీకి సిద్ధం అవుతున్నారు. ఎస్ఎస్ఎంబి 29 వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా మహేష్ బాబు ముంబై హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ముంబైలో పుట్టి పెరిగిన మోడల్ అండ్ హీరోయిన్. వంశీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ మూవీ సెట్స్ లో ప్రేమ చిగురించింది. ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఐదేళ్లకు పైగా రహస్యంగా ప్రేమించుకున్న మహేష్ బాబు-నమ్రత 2005లో అత్యంత నిరాడంబరంగా సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

అన్నయ్య చిరంజీవి నటవారసత్వాని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. నటుడిగా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వైజాగ్ కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోగా మనస్పర్థలతో విడిపోయారు. అనంతరం పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో జంటగా నటించిన రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ లకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. 2012లో రేణు దేశాయ్ కి పవన్ విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ గుజరాత్ కి చెందిన మహిళ. అనంతరం అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. తీన్ మార్ మూవీలో చిన్న పాత్ర చేసిన అన్నా లెజినోవా రష్యన్ యువతి కావడం విశేషం. ఆమెతో పవన్ కళ్యాణ్ మరో ఇద్దరు పిల్లలను కన్నాడు. 


మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియా హీరోయిన్స్ కి తెచ్చుకోవడానికి ఒకే కారణం ఉంది. అది ప్రేమ. ప్రేమికులకు కులం, మతం, ప్రాంతం, బాషా బేధం ఉండవు. మనసుకు నచ్చిన అమ్మాయిని భార్యను చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొన్ని సవాళ్లు, కుటుంబాల నుండి వ్యతిరేకతలు ఎదురైనా వెనకాడకుండా... వీరు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు.  
 

Latest Videos

click me!