దీనికి రోజా రియాక్ట్ అయితే, తాను నటించడానికి ఓకే, వాళ్లు నాతో నటిస్తారో లేదో అని తెలిపింది. ఆ తర్వాత మళ్లీ అదే ప్రశ్న వేయగా, తాను చిరంజీవితోనే నటించేందుకు ఇష్టపడతాను, ఆయన డాన్సులంటే ఇష్టమని తెలిపింది. ఈ క్రమంలో బాలయ్య మనిషిగా ఇష్టం, కానీ చిరంజీవి పక్కన అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందని తెలిపింది. ఇక నాగార్జున గురించి అడిగితే, నాగార్జునగారికి తాను అభిమానిని అని, ఆయనతో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. వెంకటేష్ ప్రస్తావన రాగా, ఆయనతో ఒక్కటే సినిమా చేశాను, పెద్దగా చేయలేదు, ఇంట్రెస్ట్ లేదని వెల్లడించింది. బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కాదు, చిరంజీవితోనే సినిమా చేస్తానని రోజా స్టేట్‌మెంట్ ఇవ్వడం విశేషం.