రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు

Published : Dec 27, 2025, 01:51 PM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్,ప్రస్తుతం ఏపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రోజా.. ఓ పాన్ ఇండియా స్టార్ హీరోను ఎత్తుకుని ఆడించిందని మీకు తెలుసా? తన కళ్లముందు పెరిగిన  హీరో.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడని ఆమె ఎంతో సంతోషపడుతోంది. ఇంతకీ ఎవరా హీరో? 

PREV
15
హీరోయిన్ గా దుమ్మురేపిన రోజా..

90 దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రోజా. ఇటు తెలుగు సినిమా.. అటు తమిళ సినిమాలో ఒకేసారి స్టార్ డమ్ తో దూసుకుపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బాలయ్య, నాగార్జున, సుమన్, జగపతిబాబు, శ్రీకాంత్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రోజా. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్, శరత్ కుమార్.. లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటి రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు.

25
సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ?

సినిమాలు, రాజకీయాలకే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేసి ప్రేక్షకులను అలరించింది రోజా. మంత్రి పదవి వచ్చిన తరువాత స్మాస్ స్క్రీన్ ను వదిలిన ఆమె.. రీసెంట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. జీలో ఓ షోకి జడ్జిగా ఆమె కనిపించింది. అంత కాదు సినిమాల్లో కూడా రోజా రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోజా తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, తన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భైరవ ద్వీపం సినిమాలో రాజకుమారి పాత్ర గురించి... అన్నమయ్యలో మోహన్ బాబు పక్కన క్వీన్ పాత్రకు సంబంధించి ఎన్నో విషయాలు ఆమె వెల్లడించారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది రోజా.

35
తెలుగు హీరోల గురించి రోజా కామెంట్స్?

వెంకటేష్ సెట్లో రిజర్వ్‌డ్‌గా ఉంటారని, తన పని తాను చూసుకుంటారని తెలిపిన రోజా.. బాలకృష్ణ మాత్రం షూటింగ్ లో చాలా ఉల్లాసంగా ఉంటారని, అందరితో కలిసి కబుర్లు చెప్పడం, పాటలు, పద్యాలు పాడుతూ సరదాగా గడుపుతారని అన్నారు. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే.. చాలా మంది హీరోయిన్లకు ఆయనంటే ఇష్టమని, ఆయన చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారని అన్నారు. చిరంజీవితో తన తొలి సినిమా ముఠామేస్త్రి గురించి మాట్లాడుతూ, మొదటి షాట్ డ్యాన్స్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సహనంతో.. తనకు ఎంతో సహకరించారని రోజా అన్నారు. కృష్ణ ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటారని, రిహార్సల్స్ కూడా లేకుండా ఒకే టేక్‌లో డాన్స్ కానీ.. డైలాగ్ కానీ పూర్తి చేసే ట్యాలెంట్ ఆయనకు ఉందన్నారు రోజా.

45
రామ్ చరణ్ ను ఎత్తుకుని ఆడించిన రోజా..

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఉన్న రామ్ చరణ్ గురించి కూడా రోజా మాట్లాడింది. చిన్నప్పుడు తాము ఆయన్ను ఎత్తుకొని పెంచామని, ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటికి వచ్చాడని గుర్తు చేసుకున్నారు రోజా.. . అప్పట్లో చరణ్ చాలా అల్లరి చేసేవాడని, ఊటి స్కూల్‌లో చేరిన తర్వాత సైలెంట్ అయ్యాడని రోజా అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు గర్వంగా అనిపించిందని, మెగా అభిమానిగా, కుటుంబ సభ్యురాలిగా ఆ సినిమాలోని మొదటి షాట్ తనకు ఎంతో నచ్చిందని రోజా తెలిపారు. చిన్నప్పుడే చిరంజీవి డాన్స్ వేస్తుంటే, రామ్ చరణ్ కూడా అదే పాటలకు డాన్స్ చేసేవాడని, చెన్నైలో ఉన్న రోజుల్లో చిరంజీవి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తేవారం అని ఆమె అన్నారు.

55
యంగ్ హీరోలలో రోజా ఫేవరెట్ ఎవరు?

ఇక ఇప్పుడు ఉన్న హీరోలలో రోజాకు ఇష్టమైన హీరో ఎవరంటే..? ప్రస్తుత తరం హీరోలలో.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి వారినటన నచ్చుతుందని. వారితో భవిష్యత్తులో అమ్మ, అత్త, వదిన పాత్రలు చేయాల్సివస్తే చేస్తానని రోజా నవ్వుతూ అన్నారు. అంతే కాదు రాజకీయాల్లో చాలా మంది నటుల కంటే ఎక్కువ యాక్టింగ్ ఉంటుందని నవ్వుతూ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories