Ram Charan: రాంచరణ్, నాగ చైతన్య మధ్య తేడా అదే.. అందుకే అంత పెద్ద డిజాస్టర్, ఇద్దరి మధ్య మతిపోగొట్టే పోలిక

Published : Dec 27, 2025, 12:49 PM IST

టాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. రాంచరణ్, నాగ చైతన్య కూడా ప్రేమ కథా చిత్రాలు చేశారు. రాంచరణ్, చైతుతో పాటు మరికొందరు హీరోలు నటించిన ప్రేమ కథా చిత్రాలు, వాటి మధ్య తేడాలని ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
టాలీవుడ్ లో నాలుగు వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రాలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నారు. రాంచరణ్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు అక్కినేని నాగ చైతన్య వృషకర్మ అనే అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ ఇద్దరు హీరోలు బలమైన బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు.  వీరిద్దరూ గతంలో ప్రేమకథా చిత్రాల్లో నటించారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, సుమంత్ కూడా లవ్ స్టోరీ చిత్రాలు చేశారు. అయితే ఈ నలుగురు చేసిన ప్రేమ కథా చిత్రాలు టాలీవుడ్ లో వైవిధ్యంగా నిలిచాయి. ఒక సినిమాకి మరో చిత్రానికి ఏమాత్రం పోలిక ఉండదు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే ఆరెంజ్, ఏ మాయ చేసావె, అర్జున్ రెడ్డి, గోదావరి. ఈ నాలుగు సినిమాల ప్రేమ కథల్లో ఉండే తేడాని కీర్తి గుడిమెళ్ల అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ చక్కగా వివరించారు. ఆమె ఒక్కో సినిమా గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. 

25
అర్జున్ రెడ్డి 

ఈ చిత్రంలో అర్జున్ ది డిస్ ఆర్గనైజ్డ్ అటాచ్మెంట్. ఇందులో విపరీతమైన ప్రేమ, విపరీతమైన బాధ ఉంటుంది. అతడి ప్రేమ చాలా డీప్ గా ఉంటుంది. కానీ స్టెబిలిటీ ఉండదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. యువతని విపరీతంగా ఆకట్టుకుంది. 

35
గోదావరి 

ఈ చిత్రంలో శ్రీరామ్, సీత లది సెక్యూర్ అటాచ్మెంట్. వారి ప్రేమలో కంట్రోల్ చేయడం అనేది ఉండదు. భయం కూడా ఉండదు. ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 

45
ఏ మాయ చేసావె 

ఈ చిత్రంలో కార్తీక్ ది ఆరాటంతో కూడిన అటాచ్మెంట్. జెస్సీని డీప్ గా లవ్ చేస్తాడు. కానీ ఆమె ఎక్కడ దూరం అవుతోందో అని భయపడుతూ ఉంటాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నాగ చైతన్యకి ఫస్ట్ హిట్ గా నిలిచింది. 

55
ఆరెంజ్ 

ఈ చిత్రంలో రామ్ ది అవాయిడెంట్ అటాచ్మెంట్. ప్రేమలో ఉంటాడు కానీ ఎమోషనల్ గా దగ్గర కాడు. ప్రేమని నమ్ముతాడు కానీ ఆ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అంటే నమ్మడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 

సైకాలజీ పరంగా చూస్తే ప్రతీ లవ్ ఒక ప్యాట్రన్ లో ఉంటుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్స్ అర్థం కాక చాలా మంది ప్రేమలో ఫెయిల్ అవుతున్నారు అని కీర్తి గుడిమెళ్ల తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories