20 వేలు మోసపోయిన ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, జి.వి. ప్రకాష్ కు షాకిచ్చిన ఆ వ్యక్తి ఎవరు?

Published : Dec 27, 2025, 11:59 AM IST

GV Prakash Scammed Online : ఆన్‌లైన్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి చేతిలో ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్   జి.వి. ప్రకాష్ మోసపోయారు. అసలు ఏం జరిగింది? ఎలా మోసపోయాడు? 

PREV
14
ఆన్ లైన్ లో మోసపోయిన జి.వి ప్రకాష్..

నటుడు, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చాలా సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అమరన్ లాంటి హిట్ సినిమాలకు మధురమైన సంగీతం అందించాడు ప్రకాశ్. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ్యుూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ప్రకాశ్ కోసం.. దర్శకులు పోటీపడి ఆయన్ని బుక్ చేసుకుంటున్నారు.

24
ఎక్స్ లో టార్గెట్ చేసిన మోసగాడు..

జివి ప్రకాష్.. చాలామందికి చాలా మందికి సహాయం చేస్తుంటారు. ఈక్రమంలో ‘మామ్ లిటిల్ కింగ్’ అనే ఎక్స్ ఖాతా నుంచి జి.వి. ప్రకాష్‌ను టార్గెట్ చేశారు. ‘మా అమ్మ చనిపోయింది, నాన్న లేరు, చెల్లి మాత్రమే ఉంది. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేవు, సాయం చేయండి’ అని పోస్ట్ పెట్టారు.

34
పాత ఫోటోలతో మోసం..

తమ తల్లి ఫోటో అంటూ పోస్ట్ చేసిన చిత్రం 2002లో ఆన్‌లైన్‌లో విడుదలైన పాత ఫోటో అని తేలింది. ఇది కూడా అబద్ధమని తెలియడంతో, జి.వి. ప్రకాష్‌ను మోసం చేసినట్లు స్పష్టమైంది. వారు కష్టాల్లో ఉన్నారని తెలిసి జీవి ప్రకాష్ వారికి ఆన్ లైన్ లో డబ్బు పంపించారు.

44
20 వేలు సెండ్ చేసిన ప్రకాష్..

జి.వి. ప్రకాష్ వారి GPay నంబర్ తీసుకుని రూ.20,000 పంపారు. ఈ విషయం వైరల్ అవ్వడంతో, ఆయన మంచి మనసును అభిమానులు మెచ్చుకుంటున్నారు. మోసపోయినా, ఆయన చేసింది మంచి పనేనని ప్రశంసిస్తున్నారు. కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని.. ఎవరు, ఏంటీ అనేది చూడకుండా.. సహాయం చేయడం.. ప్రకాశ్ మంచి మనసుకు నిదర్శనం అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories