సుజాతతో రాకేష్ ప్రేమ,పెళ్లి
రాకింగ్ రాకేష్, వ్యక్తిగత జీవితం విషయంలో కూడా మీడియా దృష్టిని ఆకర్షించారు. జబర్దస్త్ కార్యక్రమం చేస్తూ ఉండగానే, యాంకర్ సుజాతతో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఓ పాప ఉన్నారు.
ఇటీవల రాకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో త్రోబ్యాక్ ఫోటో షేర్ చేస్తూ ఈటీవీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఈటీవీ వేదికే నా మొదటి మెట్టు” అయ్యింది అని ఆయన వెల్లడించారు. ఈ టీవీ వార్షికోత్సవాల సందర్భంగా తనకు, తన భార్య సుజాతకు వచ్చిన ఆహ్వానాలు ఆయన నెట్టింట్లో షేర్ చేశారు.