జాతీయ అవార్డు సాధించిన తెలుగు సినిమాలు చూడాలని ఉందా? ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Published : Aug 02, 2025, 07:05 AM IST

నేషనల్ అవార్డు సాధించిన తెలుగు సినిమాలు థియేటర్ లో చూడటం మిస్ అయ్యారా? ఇప్పుడు ఆసినిమాలు చూడాలి అనుకుంటున్నారా? ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయో తెలుసా?

PREV
16

71 వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ తన సత్తా చాటింది. బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” నుండి చిన్న సినిమాలైన “బలగం,” “బేబీ” వరకు తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గెలిచిన సినిమాలు చూడాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈ సినిమాలు ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

26

భగవంత్ కేసరి

ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైన “భగవంత్ కేసరి” సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలంగాణ గద్దర్ అవార్డులను కూడా ఇటీవలే ఈ చిత్రం గెలుచుకుంది.

36

హనుమాన్

తేజ సజ్జ హీరోగా నటించిన “హనుమాన్” సినిమాకు రెండు నేషనల్ అవార్డులు లభించాయి. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ (నందు, పృథ్వీ) తో పాటు బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ కేటగిరీలో అవార్డులను గెలుచుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

46

బలగం

జబర్థస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన “బలగం” సినిమాలో సూపర్ హిట్ అయిన టైటిల్ సాంగ్ ‘ఊరుపల్లెటూరు’. ఈ పాట రాసిన కాసర్ల శ్యామ్ కు బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు లభించింది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. 100కు పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన “బలగం” సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

56

గాంధీ తాత చెట్టు

స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. “గాంధీ తాత చెట్టు” సినిమాలో సుకృతి అద్భుతమైన నటనకు ఈ అవార్డు లభించింది. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

66

బేబీ

సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన “బేబీ” సినిమా రెండు నేషనల్ అవార్డులు గెలుచుకుంది — ఉత్తమ స్క్రీన్‌ప్లే (నీలం సాయిరాజేష్) తో పాటు ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్ (“ప్రేమిస్తున్నా” పాట)కు జాతీయ అవార్డ్ వరించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories