అర్ధ రూపాయి జీతం నుంచి 3 వేల కోట్లకుపైగా ఆస్తులు.. ఆ కుటుంబానికి ఎలా సాధ్యమైంది, అగ్ర హీరో బయటపెట్టిన నిజాలు

Published : Aug 02, 2025, 07:32 AM IST

టాలీవుడ్ లో లెజెండ్రీ హీరోగా రాణించిన ఏఎన్నార్ కెరీర్ అర్ధరూపాయితో పారంభమైంది. ఇప్పడు ఆ హీరో కుటుంబానికి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి. అది ఎలా సాధ్యమైందో ఏఎన్నార్ వివరించారు.

PREV
15
తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని చాటిన నటులు

తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగ్గ నటులు చాలా మంది టాలీవుడ్ నుంచి వచ్చారు. నటనలో గుర్తింపు ఉన్నప్పటికీ డబ్బు కూడా అదే స్థాయిలో సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీ రంగారావు లాంటి గొప్ప నటులు ఎంతో ఘన కీర్తి సాధించారు. 

DID YOU KNOW ?
ఏఎన్నార్ జీవితాన్ని మార్చేసిన తల్లి నిర్ణయం
ఏఎన్నార్ ని చదివించాలి అంటే వాళ్ళ కుటుంబం పొలం అమ్ముకోవాలి. కానీ ఏఎన్నార్ తల్లి అలా చేయలేదు. చదివిస్తే ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. పొలం కూడా లేకపోతే తినడానికి తిండి ఉండదు అని ఆమె ఏఎన్నార్ ని నాటకాల్లో చేర్పించారట. తన తల్లి తీసుకున్న ఆ నిర్ణయమే ఇంతటివాడిని చేసింది అని ఏఎన్నార్ అన్నారు 
25
సంపాదన కోసం చిన్నతనంలోనే నాటకాల్లోకి ఏఎన్నార్

అక్కినేని నాగేశ్వరరావు పేద కుటుంబం నుంచి వచ్చి నటనలో శిఖరాగ్రానికి చేరుకున్నారు. నాలుగో తరగతికే ఏఎన్నార్ చదువు ముగిసింది. సంపాదన కోసం చిన్నతనంలోనే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఓ కార్యక్రమంలో ఏఎన్నార్ మాట్లాడుతూ.. ఆడపిల్లలాగా వేషాలు వేసేవాడిని. మా ఊర్లో అందరూ మా అమ్మతో నీ చిన్న కొడుకు నీకు ఆడపిల్ల లేని లోటు తీరుస్తున్నాడు అని చెప్పేవారు.

35
ఏఎన్నార్ ఫస్ట్ రెమ్యునరేషన్ అర్ధరూపాయి

ఆ విధంగా చిన్నతనంలోనే పావలా చెల్లించి ఓ నాటకాల కంపెనీలో చేరాను. నేను నటించిన తొలి నాటకానికి నాకు అర్థ రూపాయి జీతం ఇచ్చారు అని ఏఎన్నార్ గుర్తు చేసుకున్నారు. చదువుకోవడానికి మాకు ఆస్తులు లేవు. దీనితో ఇల్లు గడవడం కోసం నాటకాల్లోకి రాక తప్పలేదు. సినిమా రంగంలోకి వచ్చాక నా జీవితం మారిపోయింది.

45
సినిమా రంగం బాగు చేస్తుంది అని చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ

సినిమారంగంలోకి వెళితే చెడిపోతాం అని అనుకునే వారికి తన జీవితమే ఉదాహరణ అని ఏఎన్నార్ అన్నారు. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం ఆ విధంగా మారుతుంది. నాకు చదువు లేదు, తినడానికి తిండి కూడా ఇంట్లో సరిగ్గా ఉండేది కాదు, నమస్కారం పెట్టడం కూడా సరిగ్గా తెలిసేది కాదు.. అలాంటి నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి గొప్ప పాత్రల్లో నటించి బాగుపడ్డాను. సినిమా రంగం బాగు చేస్తుంది అని చెప్పడానికి నా జీవితం ఉదాహరణ.

55
చదువులేని నాకు జ్ఞానాన్ని అందించిన చిత్రాలు

భార్య తన భర్త అసమర్థుడైతే అతడిని సమర్థుడిగా ఎలా మార్చగలదో నేర్పించే చిత్రం అర్ధాంగి, ప్రేమకి అద్భుతమైన శక్తి ఉంది అని తెలియజెప్పే చిత్రం మూగమనసులు, గొప్పలకు పోయి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే చివరికి తినడానికి తిండి కూడా ఉండదు అని చెప్పే చిత్రం ధర్మదాత, జీవితంలో తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల మనసు ఎంత క్షోభపడుతుందో చెప్పే చిత్రం దేవదాసు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాను. చదువు లేని నాకు ఈ చిత్రాలన్నీ పిహెచ్ డీ చేసినంత జ్ఞానాన్ని అందించాయి అని ఏఎన్నార్ అన్నారు.  ఏఎన్నార్ తన జీవితాన్ని అర్ధరూపాయి జీతంతో ప్రారంభించారు. ఇప్పుడు ఆయన కుటుంబానికి 3 వేలకోట్లకిపైగా ఆస్తులు ఉన్నాయి. ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానిని ప్రస్తుతం నాగార్జున నిర్వహిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories