Guppedantha Manasu: వసుకి ప్రేమికుల పుస్తకం ఇచ్చిన రిషి.. మధ్యలో ఇన్వాల్వ్ అయినా గౌతమ్?

Navya G   | Asianet News
Published : Jan 05, 2022, 10:35 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: వసుకి ప్రేమికుల పుస్తకం ఇచ్చిన రిషి.. మధ్యలో ఇన్వాల్వ్ అయినా గౌతమ్?

గౌతమ్ (Gautham) తను తీసిన సెల్ఫీను రిషికి చూపించగా రిషి ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో సెల్ఫీ లను డిలీట్ చేస్తాడు. దానికి గౌతమ్ షాక్ అవుతూ బాధపడుతాడు. ఇక రిషి ఇలా సెల్ఫీ దొంగతనంగా తీసినందుకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి అంతేకాకుండా ఈ విషయం గురించి వసుధార (Vasudhara) కు చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
 

28

ఆ తర్వాత గౌతమ్ (Gautham) వసుధార ను ఊహించుకుంటూ బొమ్మ గీయాలి అనుకుంటాడు. దానికి ఆ కళ్ళను వర్ణిస్తూ ఎలా గీయాలని రిషిని అడుగుతాడు. దానికి రిషి (Rishi) వసుధార అందం గురించి ఊహించుకుంటూ వర్ణిస్తూ చెబుతాడు.
 

38

ఆ  తరువాత అక్కడినుంచి గౌతమ్ (Gautham) వెళ్ళిపోతాడు. రిషి  అక్కడే ఒంటరిగా ఉండటంతో  అందమైన కళ్ళు గురించి ఊహించుకుంటూ అనుకోకుండా వసుధార బొమ్మను గీస్తాడు. దాంతో రిషి షాక్  అవుతాడు. పదేపదే వసుధార (Vasudhara ) గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
 

48

మరోవైపు వసుధార (Vasudhara ) సోఫాలో పడుకొని ఉండగా.. జగతి అలా ముద్దుగా పడుకున్న వసుని చూసి మనసులో చాలా ఆనందం వ్యక్తం చేసుకుంటుంది. ఆ తర్వాత రిషి వాళ్ళ వదిన ధరణి  తెచ్చిన కాఫీ గురించి రిషి, గౌతమ్ (Gautham) కు ఆ విషయంలో ఫ్రెండ్లీ వార్ జరుగుతుంది.
 

58

ఆ తర్వాత జగతి, వసు (Vasu) ఇద్దరు కారులో కాలేజీ కి వెళుతుంటారు. జగతి.. వసుధార చదువు గురించి ప్రస్తావన తెస్తుంది. చదువు విషయంలో నేను కరెక్ట్ గానే ఉన్నాను మేడం అంటూ వసుధార  సమాధానమిస్తుంది. తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ.. వసు, రిషి  (Vasu, rishi) లా రిలేషన్ ని మరింత దగ్గరగా చేయడానికి ప్రయత్నిస్తుంది.
 

68

ఇంతలో కాలేజ్ కు వచ్చిన రిషి.. వసు (Vasu) గురించి ఆలోచించి వసుధార ఎక్కడుందో తెలుసుకుంటాడు. లైబ్రరీ లో ఉందన్న సంగతి తెలుసుకున్న రిషి నేరుగా క్లాస్ లోకి వెళ్ళాడు. క్లాసులో వసుధార కు రిషి (రిషి) రోమియో జూలియట్ పుస్తకం చదువుకోమని ఇస్తాడు.
 

78

తర్వాత క్లాస్ నుండి బయటకు వచ్చిన వసుధార (Vasudhara) రిషి ఈ పుస్తకం ఎందుకు ఇచ్చాడా అని ఆలోచిస్తుంది. అంతలో వసుధార దగ్గరికి రిషి (Rishi) వస్తాడు. ప్రేమంటే ఏమిటో అర్థమైందా అంటూ.. వసుధార ను అడుగుతూ ప్రేమ గురించి వివరిస్తుండగా.. ఈలోపు పానకంలో పుడకలా గౌతమ్ అక్కడికి రానే వస్తాడు.
 

88

అది చూసిన రిషి (Rishi) చిరాకు పడతాడు. ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు రా బాబు అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన గౌతమ్ (Gautham) ఉన్న చోట ఉండకుండా లవ్ గురించి వివరిస్తూ నానా రచ్చ చేస్తాడు.

click me!

Recommended Stories