ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సూపర్ స్టార్ మహేష్(Mahesh) మధ్య రెండేళ్ల క్రితం టగ్ ఆఫ్ వార్ జరిగింది. అది కేవలం బాక్సాఫీస్ వార్. బన్నీ నటించిన `అల వైకుంఠపురములో`, మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలు 2020 సంక్రాంతికి ఒక్క రోజు గ్యాప్‌తో విడుదలయ్యాయి. ఆ సందర్భంగా బాక్సాఫీసు వద్ద వీరిద్దరు పోటీ పట్టారు. నువ్వా నేనా అనేలా ఈ పోటీ నెలకొనడం విశేషం.
రెండు సినిమాల మేకర్స్.. కలెక్షన్లని పోటీ పడి ప్రకటించుకున్నారు. వంద కోట్లు, 150కోట్లు, 200కోట్లు, 250 కోట్ల వరకు ఈ పోటీ సాగింది. వాస్తవంగా వచ్చిన కలెక్షన్లకి, వీళ్లు ప్రకటించిన కలెక్షన్లకి పొంతన లేదు. ఈ ప్రాసెస్‌లోనే Maheshకి, Bunnyకి చెడిందని కామెంట్లు ఊపందుకున్నాయి. వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ వినిపించింది. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గ్యాప్ పెరిగింది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దమ్మెత్తిపోసుకుంటున్నారు. మహేష్ ట్వీట్‌తో ఆ వివాదానికి కూడా చెక్ పెట్టినట్టయ్యింది.
నిజానికి మొదట్నుంచి మహేష్‌బాబుకి, అల్లు అర్జున్ కి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఎప్పుడూ లేదు. మహేష్ ఎక్కువగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో క్లోజ్‌గా మూవ్ అవుతాడు. మంచు విష్ణుతోనూ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. బన్నీ మాత్రం సినిమాల టైమ్‌లో తప్ప మరే సందర్భంలోనూ ఇతర హీరోలతో కలిసినట్టుగా కనిపించరు. ఆయన బయటకు గెస్ట్ గా అటెండ్ అవ్వడమేగానీ, తనతో హీరోలతో క్లోజ్‌గా మూవ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఎక్కువగా మెగా ఫ్యామిలీతోనే ఉంటారని చెప్పొచ్చు.
మహేష్‌కి, బన్నీకి మధ్య అసలుకే క్లోజ్ రిలేషన్ లేదు. పైగా బాక్సాఫీసు వార్ జరగడంతో వీరిద్దరి మధ్య మరింత గ్యాప్ వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల మేకర్స్ వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే టాక్ చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో రూమర్స్ కి చెక్ పెట్టాడు మహేష్. ఎట్టకేలకు దిగొచ్చారు మహేష్. అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
`పుష్ప`(Pushpa) పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా, ఒరిజినల్‌గా, సంచలనాత్మకమైన నటనని ప్రదర్శించాడు. దర్శకుడు సుకుమార్ సినిమాని రా గా, పల్లెటూరి వాతావరణంలో, నిజాయితీగా తెరకెక్కించారు. తన క్లాస్ వేరే అని నిరూపించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గురించి ఏం చెప్పాలి. నువ్వు నిజంగా రాక్‌స్టార్` అని ప్రశంసించారు. మైత్రీ మూవీ మేకర్స్ కి, Pushpa టీమ్‌కి అభినందనలు తెలిపారు మహేష్. ప్రస్తుతం మహేష్ ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హాట్ టాపిక్ అవుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మహేష్ ట్వీట్‌కి అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మహేష్‌కి థ్యాంక్స్ చెప్పారు. `పుష్ప ప్రపంచానికి సంబంధించిన నా నటన, అందరి వర్క్ మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. హృదయాన్ని వేడెక్కించే అభినందన. వినయపూర్వకమైన ప్రేమతో` అంటూ ట్వీట్ చేశారు బన్నీ. ప్రస్తుతం ఈ ట్వీట్లు ఇద్దరు హీరోల అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. వారి మధ్య నెలకొన్న గ్యాప్‌కి చెక్ పెట్టినట్టయ్యిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. మరో వైపు `పుష్ప` చిత్రం భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఇది మూడు వందల కోట్లకి రీచ్ అయ్యిందని టాక్. అంతేకాదు హిందీలోనే 70కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
also read: టబు, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార.. ఒంటరి అందాల తారలు.. ఆ దారిలో సమంత?