Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.
కార్తీక్ (Karthik), బాబు కు బాగా జ్వరం తగలడంతో బాధపడి పడిపోతాడు. ఇటువైపు దీప ఇంకా.. ఇంటికి రానందుకు తనకు ఏమైన జరిగిందా అని టెన్షన్ పడతాడు. ఈలోపు దీప ఇంటికి వస్తుంది. కార్తీక్ కు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. దీప (Deepa) కు జరిగిన విషయం చెబుతాడు కార్తీక్.
28
ఈలోపు దీప ను పిల్లలు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటారు. ఎందుకు అమ్మా ఇంత లేట్ అయింది అని అడుగుతూ.. స్కూల్లో రుద్రాణి (Rudrani) వచ్చి చేసిన నిర్వహం గురించి చెబుతారు. ఇక పిల్లలకు ధైర్యం చెబుతుంది దీప (Deepa).
38
మరోవైపు కార్తీక్, దీప (Karthik, Deepa) ల జాడను తెలుసుకోవడానికి తిరుగుతున్న వ్యక్తి. కొండాపురంలో అలాగే తిరుగుతూ ఉంటాడు. పట్టువదలని విక్రమార్కుడిలా.. ఎలాగైనా వాళ్ల ఆచూకీ తెలుసుకుని.. సౌందర్య (Soundarya) కు తెలియజేయడానికి అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు.
48
ఇక కార్తీక్ (Karthik), బాబుకు బాగా జ్వరం జరగడంతో చల్లటి నీళ్లతో కాపురం పెడతా ఉంటాడు. ఈ లోపు దీప (Deepa) అక్కడికి వస్తుంది. కార్తీక్ డాక్టర్ అని గుర్తు చేస్తూ.. జరిగిన విషయం గురించి ఆలోచించి బాధపడకుండా తన డాక్టర్ వృత్తిని గుర్తుచేస్తూ బాగా మోటివేట్ చేస్తుంది.
58
ఆ తర్వాత దీప (Deepa) బాబు ని తీసుకుని హాస్పిటల్ కు వెళుతుండగా.. కార్తీక్ (Karthik).. బాబుకు ట్రీట్మెంట్ చేయడానికి మందుల చీటీ రాసి దీపకు ఇచ్చి ఆ మందులు తీసుకుని రమ్మంటాడు. దీప ఆనందంగా బాబును తన చేతికి ఇచ్చి మందులు తీసుకురావడానికి వెళుతుంది.
68
మరోవైపు సౌందర్య (Soundaraya) కార్తీక్ విషయంలో మోనిత ఇంకెన్ని దారుణాలుకు వడికడుతుందో అని బాధపడుతూ ఉంటుంది. ఇటు కార్తీక్ ఆచూకీ ఇంకా తెలియనందుకు మరింత బాధ పడుతుంది. పక్కనే ఉన్న ఆదిత్య (Adithya ) సౌందర్యకు ధైర్యం చెబుతాడు.
78
మరోవైపు మోనిత (Monitha) దగ్గర పనిచేసే నర్సమ్మని బస్తీ జనాలు బయటకు వెల్ల కొడతారు. దానికి మోనిత షాక్ అవుతుంది. నర్సమ్మ (Narsamma) ని బయటకు పంపడమే కాక త్వరలో నిన్ను కూడా పంపించేస్తామంటూ మోనితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళతారు.
88
ఒకవైపు దీప పిల్లలకు అన్నం పెడుతుండగా.. ఊళ్ళోవాళ్ళు దీప, కార్తీక్ (Karthik)గురించి వేలకోళంగా మాట్లాడుకున్న సంగతి పిల్లలు దీపకు తెలియజేసారు. ఆ విషయం లో దీప (Deepa) ఒక స్టోరీ ద్వారా మోటివేట్ చేస్తుంది.