Guppedantha Manasu: సరికొత్త ట్విస్ట్... తండ్రి కోసం తల్లి జగతిని ఇంటికి తీసుకెళ్ళనున్న రిషీ?

Navya G   | Asianet News
Published : Jan 25, 2022, 09:57 AM IST

Guppedantha: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
17
Guppedantha Manasu: సరికొత్త ట్విస్ట్... తండ్రి కోసం తల్లి జగతిని ఇంటికి తీసుకెళ్ళనున్న రిషీ?

మహేంద్ర వర్మ (Mahendra Varma) పడుకొని ఉండగా వెంటనే లేచి పక్కనున్న రిషిని చూసి బాధ పడతాడు. ఇక జగతి తో ఫోన్ లో మెసేజ్ ద్వారా కాసేపు చాటింగ్ చేస్తాడు. వెంటనే రిషికి (Rishi) మేలుకు రావడంతో మహేంద్ర వర్మకు వాటర్ తాపించి ఫోన్ పక్కన పెట్టమని ఇన్ డైరెక్ట్ గా చెప్తాడు.
 

27

ఇక మహేంద్రవర్మ కాసేపు రిషి (Rishi) తో మాట్లాడుతూ ఉంటాడు. రిషి మహేంద్రవర్మ తో టెన్షన్ పడొద్దు అని ధైర్యం ఇస్తాడు. ఇక మహేంద్రవర్మ కాసేపు తన బాధని అంతా మరో రూపంలో బయట పెడుతూ ఉంటాడు. దాంతో రిషి నీకేం కావాలి డాడ్ అంటూ పదే పదే అడగటంతో.. వెంటనే మహేంద్రవర్మ జగతి (Jagathi) అని అంటాడు.
 

37

ఇక ఆ మాట విని రిషి (Rishi) షాక్ అవుతాడు. ఇక మహేంద్రవర్మ భార్య యొక్క నానార్ధాలను చెబుతూ ఉంటాడు. రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక మహేంద్రవర్మ (Mahendra Varma) ప్రశ్నిస్తూ.. సంతోషం గురించి అది ఎక్కడి నుంచి అందాలో అన్న దాని గురించి చెబుతాడు.
 

47

ఉదయాన్నే లేచి చిరునవ్వుతో భార్య ఇచ్చే కాఫీతో సంతోషం ఉంటుంది అని చెబుతాడు. అలా భార్య, కొడుకు తన మధ్యలో ఉండే కొన్ని సన్నివేశాలను ఊహించు కొని చెబుతాడు. రిషి (Rishi) మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరోవైపు జగతి (Jagathi) ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి.
 

57

ఇక వసు (Vasu).. తమ ఊర్లో జరిగే సంక్రాంతి పండుగ గురించి వివరిస్తుంది. ఇక జగతి తనకు పండుగలన్నీ క్యాలెండర్లో కనిపిస్తాయి అని తన మనసులో బాధ ను బయట పెడుతూ ఉంటుంది. ఇక దాంతో వసు కాస్త డల్ గా ఫీల్ అవుతుంది. రిషి (Rishi) ఇంట్లో ఒంటరిగా కూర్చొని మహేంద్రవర్మ మాట్లాడిన మాటలు తలుచుకుంటాడు.
 

67

డాడ్ కోసం ప్రపంచంలో ఏదైనా తీసుకొని వస్తానని నిర్ణయించుకుంటాడు. డాడ్ కోసం ఆమాత్రం చెయ్యనా అని అనుకుంటాడు. అప్పుడే గౌతమ్ (Gautham) వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో రిషి తనని ఒంటరిగా వదిలేయమని అంటాడు. ఇక రిషి (Rishi) అలానే ఆలోచనలో పడతాడు.
 

77

ఇక రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి వసుతో పర్సనల్ గా మాట్లాడాలి అని బయటకు తీసుకెళతాడు. మరోవైపు జగతి ధరణితో (Dharani) మహేంద్ర పెట్టవలసిన ఫుడ్ లిస్ట్ ను చెబుతుంది. తరువాయి భాగంలో రిషి జగతి దగ్గరికి వచ్చి తన డాడ్ సంతోషం కోసం జగతి, రిషి వాళ్లను తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ మాట విని జగతి (Jagathi) బాగా సంతోషపడుతుంది. మొత్తానికి జగతి గుడ్ న్యూస్ విన్నది.

click me!

Recommended Stories