Karthika Deepam: కార్తీకదీపంలో కామెడీ సీన్.. రుద్రాణికి రాయి చూపించి మనుషులకు షాకిచ్చిన డాక్టర్ బాబు!

Navya G   | Asianet News
Published : Jan 25, 2022, 08:55 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Karthika Deepam: కార్తీకదీపంలో కామెడీ సీన్.. రుద్రాణికి రాయి చూపించి మనుషులకు షాకిచ్చిన డాక్టర్ బాబు!

మహాలక్ష్మి (Mahalaxmi) వచ్చి రుద్రాణి గురించి తన మూర్ఖత్వం గురించి దీపకు (Deepa) చెప్పటంతో దీప కోపంతో రగిలిపోతుంది. అంత డబ్బు ఏం చేసుకుంటుందని.. ఎందుకిలా ప్రవర్తిస్తోంది అని అంటుంది. కాసేపు తన అత్తయ్య, మామయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
 

27

ఇక కార్తీక్ (Karthik) రుద్రాణి కి డబ్బులు ఇవ్వడానికి బయలుదేరుతాడు. ఇక రుద్రాణి మాటలను తలచుకుంటాడు. దీప వచ్చి వెళ్లిందని రుద్రాణి చెప్పటంతో కార్తీక్ కు డౌట్ వస్తుంది. పైగా హోటల్ యజమాని కూడా డబ్బులు తీసుకెళ్ళింది అనడంలో ఇంటికి వెళ్లి దీప (Deepa), బాబు ఉన్నారా లేరా  అనుకుంటాడు.
 

37

ఒకవేళ దీప (Deepa), బాబు ఉన్నట్లయితే ఖచ్చితంగా వంటమనిషి దీపనే అని అనుకుంటాడు.  ఇంటికి వెళ్తూ వెళ్తూ దీప వంటమనిషి కాకూడదని.. ఇంట్లో దీప  ఉండకూడదని అనుకుంటాడు. ఇక దీప, పిల్లలు బాబుతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు కార్తీక్ (Karthik) ఇంట్లో దీప వాళ్లు ఉండకూడదు అని అనుకుంటాడు.
 

47

అలా నేరుగా ఇంట్లో దీప వాళ్ళను చూసి బాధ పడతాడు. వంటమనిషి దీపనే అని అనుకుంటాడు. దీపకు వేడి పడదు కదా అని అనుకోని బాధపడుతాడు. ఇక పిల్లలు కార్తీక్ (Karthik) ను చూసి.. నాన్న వచ్చాడు అంటూ ఆనంద్(Anand) కు చూపిస్తారు. ఇక కార్తీక్ తన మనసులో అమ్మ తీసుకొచ్చిందా నానా అని అనుకుంటాడు.
 

57

ఇదంతా నా వల్లే జరిగింది అని అనుకుంటాడు. ఇక పిల్లలు బాబును తీసుకోని బయటకు వెళ్తారు. కార్తీక్ (Karthik) డబ్బులు ఎవరు ఇచ్చారని అడుగుతాడు. నేను ఒకరి ఇంట్లో పని చేస్తున్న కదా అక్కడ వాళ్లు ఇచ్చారని అంటుంది. దీప (Deepa) తన మనసులో అబద్ధం చెప్తున్నానని బాధ పడుతుంది.
 

67

కార్తీక్ తాను తెచ్చిన డబ్బులు ఇస్తాడు. ఎక్కడ నుండి తెచ్చాడు అనేసరికి పక్క ఊరిలో ఎరువుల కొట్టులో చేస్తున్న కదా అక్కడనుండి తెచ్చాను అని అంటాడు. తన మనసులో కూడా దీపకు అబద్ధం చెప్పానని బాధపడతాడు. ఇక మోనిత (Monitha) విన్నీ (Vinny) తో కాసేపు తన బాబు గురించి, కార్తీక్ గురించి మాట్లాడుతుంది.
 

77

కార్తీక్ (Karthik) రోడ్డుపై నడుస్తూ దీప గురించి ఆలోచిస్తాడు. అదే సమయంలో రుద్రాణి (Rudrani) మనుషులు కారులో వస్తారు. కార్తీక్ ను చుసిన వాళ్ళు బురద పడేయాలని చూస్తారు. అది గమనించిన కార్తీక్ తిరిగి రాయి పట్టుకొని షాక్ ఇవ్వడంతో వాళ్ళు బయపడి కార్తీక్ ను మర్యాదగా పలకరించి వెళ్తారు. దీప ఇంటీ పరిస్థితి గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తుంది.

click me!

Recommended Stories