ఇప్పుడే అటువైపు వెళ్లారు అని చెప్పడంతో వాళ్లు చెప్పిన వైపు వెళుతుంది కానీ వసు వెళ్లేసరికి రిషి కార్లో వెళ్ళిపోతాడు. మరోవైపు రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విశ్వనాథం, ఏంజెల్. అప్పుడే ఇంటికి వచ్చిన రిషి ని కాలేజీ ఎలా ఉంది అని అడుగుతాడు విశ్వనాథం. ఏమి బాగోలేదు సార్ ఆ కేడి గ్యాంగ్ ఆగడాలు శృతి మించిపోయాయి అంటాడు రిషి. అయితే వాళ్లని సస్పెండ్ చేద్దాము అంటుంది ఏంజెల్.