సిద్దార్థ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అతడికి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. అక్కడ యాంకర్స్ వేదికపైకి సిద్దార్థ్ కి తెలియకుండా సుజాత రంగరాజన్ అనే మహిళని తీసుకువచ్చారు. ఒక్కసారిగా సిద్దార్థ్ ఆమెని చూడడంతో నమ్మలేకపోయాడు. వెంటనే సిద్దార్థ్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆమె కాళ్లపై పడి మొక్కాడు. ప్రేమగా కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు.