అలాంటిదేమీ లేదు అంటాడు రిషి కానీ తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్లు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని వాళ్లు కాలేజీ బాధ్యతలు తీసుకోమనట్లేదు కదా కేవలం టీచింగ్ చేయమంటున్నారు అని మనసులో అనుకొని లెక్చరర్ గా వెళ్ళటానికి నిర్ణయించుకుంటాడు రిషి. అదే విషయాన్ని ఏంజెల్ వాళ్లకి చెప్తే సంతోషిస్తారు. సీన్ కట్ చేస్తే మహేంద్ర ఫ్రెండ్ బాధపడుతున్న మహేంద్ర కి ధైర్యం చెబుతూ ఉంటాడు.