విక్రమ్ కూడా దివ్య నే సపోర్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కోర్టులో సాక్షి కోసం జడ్జితో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతను ఎంతకీ రాకపోవడంతో కోర్టు టైము వేస్ట్ అవుతుంది అని చెప్పి కేసు క్లోజ్ చేయడానికి సిద్ధపడతారు జడ్జ్. సరిగ్గా అదే సమయానికి శేఖర్ కోర్టులోకి వచ్చి తన సాక్ష్యం వినిపిస్తాడు. నందుని ట్రాప్ చేసి తన వైపు తిప్పుకుందని, నా కొడుకుని నాకు ఇవ్వటం లేదు తను పట్టించుకోవడం లేదు అని చెప్తాడు శేఖర్.