ఇక సినిమాల్లో తొలి ఛాన్స్ ఆమెకి 2012లో దక్కింది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఆ మూవీలో లావణ్య త్రిపాఠి క్యూట్ పెర్ఫామెన్స్ తో భలే మెప్పించింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, మిస్టర్, అంతరిక్షం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి క్రేజీ చిత్రాల్లో నటించి మెప్పించింది.