మీరు నా మాటకి కట్టుబడాలి లేకపోతే ఈ పొగరు హర్ట్ అవుతుంది అంటుంది వసు. ఈ మాత్రానికే ఇలా అయిపోతే, రేపు జరగరానిది ఏమైనా జరిగితే ఎలా తట్టుకుంటావు, దేనికైనా తట్టుకొని నిలబడగలగాలి అంటాడు రిషి. మూతి ముడుచుకున్న వసు దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పినట్లే వింటానులే ఈ బ్రేస్లెట్ తో కట్టి పడేసావ్ కదా అని నవ్వుతూ చెప్తాడు రిషి. తరువాత శైలేంద్ర గురించి ఆలోచిస్తూ అతను కావాలనే క్యాబిన్ గురించి మాట్లాడాడు అంటూ భర్తకి చెప్తుంది జగతి.