Guppedantha Manasu: తమ్ముడు చావుకు ప్లాన్ వేసిన శైలేంద్ర.. ప్రాణాపాయ స్థితిలో రిషి!

First Published Jun 1, 2023, 10:30 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అన్న రాక్షసత్వానికి బలైపోయిన ఒక తమ్ముడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర రౌడీల కి ఫోన్ చేసి ఎలాగైనా రిషి ని లేపేయండి వాడు బ్రతికుంటే నాకు చాలా ప్రమాదం. క్రితంసారి లాగా కాస్తలో మిస్సయింది అని చెప్పొద్దు నేను గుడ్ న్యూస్ విని తీరాలి లేదంటే నీ ఫోటోకి దండ పడుతుంది అని చెప్తాడు శైలేంద్ర. లేదు సార్ ఈసారి పక్కా ప్లాన్ తోనే వెళ్తాము అంటాడు రౌడీ. మీ ప్లాన్స్ మీద నాకు నమ్మకం లేదు నేను చెప్పినట్లు చేయు అంటూ ఏదో ప్లాన్ చెప్తాడు శైలేంద్ర.
 

 సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు రౌడీ. మరోవైపు కాలేజీలో ఉన్న జగతి తను చేసిన పనికి బాధపడుతూ ఉంటుంది. నేను చేసింది తప్పే కానీ నీ ప్రాణాలని కాపాడుకోవడం కోసమే చేశాను. చేసిన తప్పుకి కోప్పడతావ్ అనుకున్నాను కానీ మాకు దూరం అయిపోయి ఇంత పెద్ద శిక్ష వేస్తావనుకోలేదు అంటూ కొడుకు ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అదే సమయంలో రిషి మీద రౌడీలు అటాక్ చేసి కత్తులతో పొడిచి పారిపోతారు.
 

 అదే సమయంలో జగతి ముందున్న రిషి ఫోటో కింద పడిపోతుంది. అపశకునంగా  భావించిన జగతి ఏడుస్తూ భగవంతుడా నువ్వే నా కొడుకుని కాపాడాలి అంటూ వేడుకుంటుంది. మరోవైపు కింద పడి ఉన్న రిషి ని అక్కడ ఉన్న స్థానికులు చూసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు. అదే సమయంలో మహేంద్ర అటువైపుగా వస్తాడు. అక్కడ జనాలు ముగ్గు ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. ఎవరికో యాక్సిడెంట్ అయింది అని చెప్తారు అక్కడ ఉన్న వ్యక్తి.
 

సరే నాకార్ లో తీసుకు వెళ్దాం రండి అంటాడు మహేంద్ర. ఇంతలో అంబులెన్స్ రావటంతో అందులో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతారు  స్థానికులు. అదే సమయానికి ఎవరు ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడుతూ కొడుకు మొహం కూడా చూడలేక పోతాడు మహేంద్ర. అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాత ఏ తల్లి కన్న బిడ్డో భగవంతుడా రక్షించు అంటూ దండం పెట్టుకుంటాడు. వసు తన తల్లిని జాయిన్ చేసిన హాస్పిటల్ కే రిషి ని తీసుకువెళ్తారు.

పేషెంట్ ని చూసిన డాక్టర్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వీళ్ళ బంధువుల చేత ఫామ్ ఫిల్ చేయించండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అంటాడు. బంధువులు ఎవరూ లేరు సార్ యాక్సిడెంట్ అని చెప్తాడు రిషి ని తీసుకువచ్చిన ఆ స్థానికుడు. అలా అయితే ట్రీట్మెంట్ చేయడం కుదరదు అంటూ నిరాకరిస్తాడు డాక్టర్. అప్పుడే మందులు తీసుకు వస్తున్న వసు అదేంటి డాక్టర్ అలా అంటారు డాక్టర్లు దేవుడితో సమానం మీరు అలా అనొచ్చా అంటుంది.
 

వాళ్ల వాళ్ళు వచ్చి గొడవపడితే సమాధానం చెప్పుకోలేం మేడం. పోలీస్ కేసు అది అవుతుంది అంటాడు డాక్టర్. సరే అయితే ఆ ఫామ్ ని నేను ఫిల్ చేస్తాను వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే నేను సమాధానం చెప్తాను అంటూ ఫామ్ ఫిల్ చేస్తుంది వసు. రిషిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకు వెళ్తుంటే మొహం కనిపించదు కానీ అతని చేతికి ఉన్న బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది వసు.
 

రిషి సర్ బ్రేస్లెట్ లాగా ఉంది అనుకుంటూ అటువైపు వెళుతుంది. ఇంతలో సిస్టర్ వచ్చి మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పడంతో కంగారుగా తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో రిషిని కాపాడటానికి  శాయశక్తులా  ప్రయత్నిస్తారు డాక్టర్లు. కానీ అతని హార్ట్ బీట్ ఆగిపోవడంతో చూస్తూ ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇన్ని సంవత్సరాలలోనే జగతిని కలవడానికి ఇష్టపడదు వసు. ఇన్ని సంవత్సరాలు భార్యతో మాట్లాడటం మానేస్తాడు మహేంద్ర.
 

వంటరిదైన వసుకి తోడుగా ఉంటాడు తండ్రి చక్రపాణి. మహేంద్ర తనతో మాట్లాడకపోయినా జగతి మాత్రం మహేంద్ర తో మాట్లాడుతూ తనతో మాట్లాడమని బ్రతిమాలుతూ ఉంటుంది. అది చూసిన శైలేంద్ర దేవయాని నవ్వుకుంటారు. మనం ఎన్ని చేసినప్పటికీ ఎండి సీట్ ని దక్కించుకోలేకపోయాము. లాభం లేదు మళ్లీ ఏదైనా ప్లాన్ చేసి పిన్నిని కూడా పక్కకు తప్పించాలి అంటాడు శైలేంద్ర. కానీ జాగ్రత్త పిన్ని ఇప్పుడు చాలా కోపం మీద ఉంది.
 

 ఎదురు తిరిగితే మనకే ప్రమాదం అని హెచ్చరిస్తుంది దేవయాని. అదంతా నేను చూసుకుంటాను ఆల్రెడీ ఒక ప్లాన్ వేసే ఉంచాను. ఎలా అయినా ఎండి సీట్లో కూర్చుని తీరుతాను అంటాడు శైలేంద్ర. నాకు కావలసింది కూడా అదే చేసేదేదో త్వరగా చెయ్యు అంటుంది దేవయాని. ఆ తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!