Intinti Gruhalakshmi: దివ్య చేత కన్నీరు పెట్టించిన రాజ్యలక్ష్మి.. మితిమీరిన లాస్య దౌర్జన్యం!

First Published Jun 1, 2023, 8:45 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మూర్ఖత్వంతో అకారణంగా భర్తని జైలుకు పంపించిన ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో ఇప్పటికీ మించిపోయినది ఏమీ లేదు నేను చెప్పినట్లు విను నీ బ్రతుకు మారుస్తాను అంటుంది లాస్య. నువ్వు మార్చడం కాదు  జైల్ నుంచి వచ్చాక నేను నీ బ్రతుకుని మారుస్తాను. విడాకులకి సిద్ధంగా ఉండు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. లాస్య రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి ఇకనుంచి నీ కోడలు ఒంటరిది తండ్రి జైలుకెళ్లాడు.

ఇంక తనకి బ్యాక్ బోన్ లేనట్టే నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలకి సంతోషిస్తుంది రాజ్యలక్ష్మి. విషయం ఏంటి అని అడుగుతాడు బసవయ్య. దివ్య తండ్రి జైలుకు వెళ్ళాడంట ఇకనుంచి దివ్య ఒంటరి పక్షి దాన్ని నేను ఒక ఆట ఆడిస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. తను ఒంటరిగా ఎందుకు అవుతుంది? తోడుగా నీ కొడుకు ఉన్నాడు కదా అంటాడు బసవయ్య.
 

వాడు నా చేతిలో కీలుబొమ్మ అంటూ గర్వంగా చెప్తుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఒంటరిగా నడుస్తున్న తులసి దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మించి పోయింది లేదు నందుని నా దగ్గరికి వచ్చేలాగా చేయు అంటుంది లాస్య. అరిగిపోయిన రికార్డు లాగా ఎందుకు పదేపదే అదే చెప్తావు. తెలిసి తెలియని తనంతో చేస్తున్నవేమో అనుకున్నాను కానీ నీలో ఇంత రాక్షసత్వం ఉందనుకోలేదు. భర్తని జైలుకు పంపించినందుకు కాస్త కూడా బాధ లేదా అంటూ చివాట్లు పెడుతుంది. 
 

 నేను ఆటలో దిగినంతవరకే ఆట దిగాను అంటే వేటే  చూస్తూ ఉండు నీ అన్యాయాన్ని బయటపెడతాను కేసుని మళ్లీ రీ ఓపెన్ చేయిస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరోవైపు దివ్య నాకైతే కన్నీరు పెట్టించింది ఇప్పుడు చూడు దాంతో ఎలా ఆడుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. మేము తోడందుకుంటాంలే అక్కయ్య అంటాడు బసవయ్య. ఇంతలో దివ్య, విక్రమ్ ఇంటికి వస్తారు.
 

మీ మావయ్య గారు కూడా మన మనిషే అందుకే మీ మామయ్య మంచి చెడు మాట్లాడాడు దివ్య అపార్థం చేసుకున్నట్లుగా ఉంది వెళ్లి ఓదార్చు అని విక్రమ్ తో చెప్తుంది రాజ్యలక్ష్మి. సీన్ కట్ చేస్తే కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పరంధామయ్య దంపతులు. ఇంతలో తులసి వాళ్ళు రావడంతో నందు ఏడి అని అడుగుతారు. కాస్త ఆలస్యంగా 5 ఏళ్ల తర్వాత వస్తారు అని చెప్తాడు మాధవి భర్త. దాంతో తీవ్ర మనస్థాపానికి గురవుతారు పరంధామయ్య దంపతులు.
 

 మరోవైపు దిగులుగా ఉన్న దివ్య దగ్గరికి టీ తీసుకొని వస్తాడు విక్రమ్. నాకేమీ అక్కర్లేదు అంటుంది దివ్య. వాళ్ల మాటలు పట్టించుకోవద్దు అంటాడు విక్రమ్. నేను బాధపడుతున్నది వాళ్ళు ఏదో అన్నారని కాదు కానీ వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావే అందుకు బాధపడుతున్నాను. నేను కూడా మీ అమ్మ వాళ్ళని నాలుగు మాటలు అంటాను అప్పుడు ఇలాగే తేలిగ్గా తీసుకుంటావా అని నిలదీస్తుంది దివ్య. ఈ ఇంట్లో తాతయ్య గారికి ఎలాంటి గౌరవం లభిస్తుందో మీ నాన్నగారిని ఎవరు ఎంతలా పట్టించుకుంటున్నారో నాకు తెలుసు.
 

 నిలదీసి అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటారు. చేయని తప్పుకి మా నాన్న జైలుకు వెళ్లారు అని ఏడుస్తుంది దివ్య. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను అని హామీ ఇస్తాడు విక్రమ్. మరోవైపు మనం దివ్యని మాటలాడటం కాదు గాని వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గేలాగా ఉంది. ఈవిడ గారు ఏడవటము ఆయన గారు భుజాలు ఇవ్వడం అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. అవును వదిన వాళ్ళు గదిలోకి వెళ్లి చాలాసేపు అయింది ఇప్పటికీ బయటకు రాలేదు అంటుంది బసవయ్య భార్య.
 

 తరువాయి భాగంలో దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి కేఫ్  డాక్యుమెంట్స్ తీసుకుంటుంది లాస్య. ఇదేమి బాగోలేదు అంటూ పరంధామయ్య దంపతులు కేకలు వేస్తారు. నిన్ను బోన్లో నిలబెడతాను అంటూ తులసి కూడా గట్టిగా మాట్లాడుతుంది. నీ కూతురికి అత్తారింట్లో పుట్టింటి ఆలోచనలతోనే సమయం సరిపోతుంది ఇలా అయితే తన కాపురానికే సమస్య అంటూ తులసిని హెచ్చరిస్తుంది రాజ్యలక్ష్మి.

click me!