Guppedantha manasu: సాక్షిని పెళ్లి చేసుకోనని డైరెక్ట్‌గా చెప్పేసిన రిషీ.. షాక్‌లో దేవయాని!

Published : Aug 02, 2022, 10:16 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha manasu: సాక్షిని పెళ్లి చేసుకోనని డైరెక్ట్‌గా చెప్పేసిన రిషీ.. షాక్‌లో దేవయాని!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... జగతి,రిషికి "మనిషి జీవితం గురించి" కొన్ని సలహాలు ఇస్తుంది. ఇలా చెప్పిన తర్వాత "వాసుధారకి మీరంటే ఇష్టం" అని చెబుతుంది. రిషి మాత్రం కోపంతో "ఇదే మాట మీరు గతంలో కూడా చెప్పారు. నాకు వసుధార అంటే ఇష్టం అని, అప్పటికి నేను ప్రేమని గుర్తించని సమయంలో చెప్పారు.తర్వాత అది నాకు తెలిసి వసుదారికి చెబితే నన్ను వద్దన్నది.

26

తల్లి మనసు అర్థం చేసుకోని మీ మనసులో ప్రేమ ఉంటుందంటే నేను నమ్మను, అని చెప్పి నన్ను వద్దనుకుంది, ఇప్పుడు అదే మాట మార్చి తనకు నేనంటే ఇష్టమని చెబుతున్నారు. నా జీవితంలోకి వచ్చిన ప్రతి స్త్రీ ఏదో ఒక బాధను మిగిల్చే వెళ్తుంది" అని రిషి అనగా "మీ ప్రేమ మీకు తెలియక ముందే నాకు ఎలా తెలిసిందో అలాగే  వసుదార ప్రేమ కూడా మీకు ఏనాడైనా కచ్చితంగా తెలుస్తుంది.

36

తనని మీరు ఎంత ప్రేమిస్తున్నారో దానికి రెండింతలు ఎక్కువ ప్రేమిస్తుంది"అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి.రిషి ఆలోచనలలో పడతాడు. మరొకవైపు వసుధారా రిషి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు రిషి కూడా వసుధార. గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. వసుధార రిషికి ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటాది.

46

అదే సమయంలో రిషి కూడా వసుధారకి ఫోన్ చేయాలనుకుంటారు.ఇద్దరు ఒకేసారి ఫోన్ చేయడానికి ప్రయత్నించగా లైన్ కలవదు. తిరిగి వస్తారు మళ్ళీ ఫోన్ చేయగా అప్పుడు రిషి ఫోన్ ఎత్తుతాడు. ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ఈలోగా సాక్షి తో జరిగిన సంఘటన వసుధార గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఏమైంది అని రిషి అడగగా ఏమి చెప్పదు.

56

నేను నిన్ను రేపు కలుస్తాను అప్పుడు మాట్లాడుకుందామని రిషి అంటాడు సరే అని ఫోన్ పెట్టేస్తుంది వసుధార. దాని తర్వాత సీన్లో దేవయాని కుటుంబ సభ్యులందరినీ పిలిచి సాక్షితో రిషి పెళ్లి గురించి మాటలు మొదలు పెడుతుంది. ఈ లోగ రిషి తనకి పెళ్లంటే ఇష్టం లేదని, కేవలం కాలేజ్ పరువు కోసం ఆరోజు తన మాట విప్పలేదని,కలాకండిగా వాళ్ళ పెద్దమ్మకి చెప్పేస్తాడు.
 

66

దేవయాని ఇంకా సాక్షితో పెళ్లి గురించి ఆశలు పెట్టుకుంది అని తెలియగా ఆ రోజు లైబ్రరీలో తనని అల్లరి చేశాను అని చెప్తాను అని బెదిరించిన విషయం చెబుతాడు, దేవయాని ఆశ్చర్య పోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!.

click me!

Recommended Stories