ఇటీవల లోకేష్ కనకరాజ్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన విక్రమ్ చిత్రంలో రీ సౌండింగ్ విక్టరీ అందుకుంది. తమిళ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కమల్ హాసన్ మునుపటి జోరు అందుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో విక్రమ్ చిత్రం విజృంభించింది. కమల్ హాసన్ స్టార్ పవర్ ని మరోసారి చూపించింది.