Guppedantha Manasu: వసుకు పరీక్ష పెట్టిన గౌతమ్.. సాక్షి, వసుల మధ్య మొదలైన వార్!

Published : May 09, 2022, 09:44 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 9 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: వసుకు పరీక్ష పెట్టిన గౌతమ్.. సాక్షి, వసుల మధ్య మొదలైన వార్!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గౌతమ్ (Goutham) ఈ విషయం నీకు చెప్పాలని రోజు అనుకునేవాడిని కానీ మొత్తానికి ఈ రోజు ధైర్యం చేసాను అని వసు తో అంటాడు. దాంతో వసు (Vasu) మీరు రిషి సార్ ఫ్రెండ్ కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటుంది.
 

26

అంతేకాకుండా మీరు ఐలవ్యూ అంటే నేను ఒకే అంటానని మీరు ఎలా అనుకుంటారు అని అంటుంది. ఆ మాటలు విన్న రిషి (Rishi) నీ మనసులో ఎవరున్నారు తెలుసుకోవడమే.. నా గోల్ అని అనుకుంటాడు. ఒకవైపు వసు నా జీవిత లక్ష్యాన్ని చేరడమే ప్రస్తుతం నా కర్తవ్యం అని గౌతమ్ (Goutham) తో అంటుంది.
 

36

ఇక రిషి (Rishi) నేను అంటే ఇష్టం లేకపోయినా.. నా గిఫ్ట్ మాత్రం తీసుకొ అని గౌతమ్ ఆ గిఫ్ట్ ను ఇస్తాడు. ఆ గిఫ్ట్ లో ఉన్న తన ఆర్ట్ ను చూసి వసు ఎవరు గీసారని తెగ ఆనంద పడుతుంది. దాంతో గౌతమ్ (Goutham) ఇది కూడా ఒక గోల్ లాంటిదే కనుక్కో చూద్దాం అని చెబుతాడు.
 

46

ఆ తర్వాత రిషి (Rishi) దగ్గరికి వెళ్లిన గౌతమ్ వసు ప్రపోజల్ రిజెక్ట్ చేసినందుకు బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసు (Vasu) ఆ బొమ్మ గీసిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కళకి హ్యాట్సాఫ్ చెబుతుంది. ఇక ఇంత గొప్పగా బొమ్మ గీసిన ఆ వ్యక్తి గురించి నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటుంది.
 

56

అంతేకాకుండా వసు (Vasu) గతంలో తనకు లవ్ లెటర్ రాసిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఆ లెటర్ లో మేటర్ గురించి గొప్పగా అనుకుంటుంది. మరో వైపు రిషి (Rishi) మహేంద్ర దంపతులతో నేను ఒక పార్టీ ఇవ్వబోతున్నాను.. ఆ పార్టీకి చీఫ్ గెస్ట్ గౌతమ్ అని అంటాడు. ఆ తర్వాత రిషి వసు పని చేసే రెస్టారెంట్ కి వెళతాడు.
 

66

ఇక రెస్టారెంట్లో రిషి (Rishi) వసుతో మాట్లాడుతూండగా సాక్షి వాళ్ళిద్దర్నీ చూసి.. రిషి ఏంటి చీప్ గా దీంతో తిరుగుతున్నాడు అని అనుకుంటుంది. ఇక సాక్షి దగ్గరికి వెళ్లగా.. రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కొంత సేపు వసు, సాక్షి (Sakshi) ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

click me!

Recommended Stories