ఆ విషయంలో రష్మిక మందన్నాని ఫాలో అవుతున్న కీర్తిసురేష్‌.. నష్ట నివారణ చర్యలు షురూ..?

Published : May 09, 2022, 07:33 AM ISTUpdated : May 09, 2022, 08:05 AM IST

కీర్తిసురేష్‌ హోమ్లీ గర్ల్ కి కేరాఫ్‌. కానీ ఇప్పుడు తన రూట్‌ మార్చింది. తాను అన్నింటికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చింది. ఈ విషయంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాని ఫాలో అవుతున్నట్టుంది కీర్తిసురేష్‌. 

PREV
18
ఆ విషయంలో రష్మిక మందన్నాని ఫాలో అవుతున్న కీర్తిసురేష్‌.. నష్ట నివారణ చర్యలు షురూ..?

కీర్తిసురేష్‌(Keerthy Suresh) అంటే అందరికి గుర్తొచ్చేది `మహానటి`నే. సావిత్రి కంటే మహానటి అనే పేరు కీర్తిసురేష్‌కే ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ట్రెడిషనల్‌ రోల్స్ చేస్తూ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది కీర్తిసురేష్‌. కీర్తి అంటే మనింటి అమ్మాయిలా అనిపిస్తుంటుంది. ఆడియెన్స్ కూడా అలానే ఫీలవుతుంటారు. 

28

ఇదే కీర్తిసురేష్‌కి మైనస్‌గా మారుతుంది. `హోమ్లీ హీరోయిన్‌` అనే ట్యాగ్‌ ఆమెని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తుంది. అంతేకాదు రిస్క్ లో పడేస్తుంది. అలాంటి ట్యాగ్‌తో అలాంటి పాత్రలే వస్తుండటంతో కీర్తిసురేష్‌ కెరీర్‌ అయోమయంలో పడుతుంది. పైగా ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. `మహానటి` తర్వాత కీర్తి నటించిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. `పెంగ్విన్‌`, `మిస్‌ ఇండియా`, `పెద్దన్న`, `చిన్ని`, `గుడ్‌ లక్‌ సఖీ` ఇలా అన్ని చిత్రాలు బోల్తా కొట్టాయి. దీంతో కీర్తిసురేష్‌ కెరీర్‌ సందిగ్దంలో పడింది. 

38

రజనీకాంత్‌(Rajinikanth)తో `పెద్దన్న` చిత్రంలో ఆయనకు చెల్లి పాత్రలో చేసి సాహసం చేసింది. కెరీర్‌ని డేంజర్‌లో పడేసుకుంది. హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలో ఓ స్టార్‌ హీరో పక్కన చెల్లిగా చేస్తే అది ఆమెపై మేకర్స్ లో ఉన్న ఒపీనియన్‌ మొత్తం మార్చేస్తుంది. మార్కెట్‌ పరంగా డ్యామేజ్‌ జరుగుతుంది. అదీ కాదని మళ్లీ చిరంజీవికి చెల్లిగా చేస్తుంది `భోళా శంకర్‌` చిత్రంలో. దీంతో కీర్తి కెరీర్‌ ట్రాక్‌ తప్పుతుందనే విమర్శలు ఊపందుకున్నాయి. 

48

అయితే రాబోయే పెను ప్రమాదాన్ని ముందే పసిగట్టునట్టుంది కీర్తిసురేష్‌. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.తనని తాను కొత్తగా ఆవిష్కరించే పనిలో పడింది. ప్రస్తుతం మహేష్‌బాబు(Maheshbabu)తో కలిసి నటిస్తున్న `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata) చిత్రాన్ని అందుకు వేదికగా చేసుకుంది. ఈ సినిమా విషయంలో మొత్తంగా రూట్‌ మార్చింది కీర్తిసురేష్‌. బోల్డ్ లుక్‌లోకి మారిపోయింది. గ్లామర్‌ హీరోయిన్‌ అవతారం ఎత్తింది. 
 

58

ముఖ్యంగా ఇటీవల విడుదలైన `మ మ మహేషా` సాంగ్‌లో మాత్రం ఐటెమ్‌ గర్ల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా రెడీ అయి మాస్‌ స్టెప్పులేసింది. మహేష్‌నే డామినేట్‌ చేస్తూ ఊరమాస్‌స్టెప్పులతో ఉర్రూతలూగించింది. ఈ పాటలో ఆమె చేసే మాస్‌ స్టెప్పులకు యావత్‌ తెలుగు ఆడియెన్స్ షాక్‌ అయ్యారంటే అతిశయోక్తి కాదు. అంతగా రెచ్చిపోయింది కీర్తిసురేష్‌. తన రూట్‌ మార్చుతుందనేందుకు ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. అంతేకాదు మహేష్‌ సినిమాపైనే అన్ని హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమా హిట్‌ అయితే కెరీర్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది, లేదంటే మరింత రిస్క్ లో పడుతుందని అంటున్నారు క్రిటిక్స్. 

68

అదే సమయంలో హోమ్లీ గర్ల్ అనే ట్యాగ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలని డిసైడ్‌ అయినట్టుంది కీర్తిసురేష్‌. గ్లామర్‌ షోకి తెరలేపుతుంది. అందాలు ఆరబోసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. `సర్కారు వారి పాట`లో గ్లామరస్‌, హాట్‌గా కనిపించింది కీర్తిసురేష్‌. హీరోయిన్‌గా లాంగ్‌ రన్‌ కావాలంటే కమర్షియల్‌ హీరోయిన్‌గానూ పేరుతెచ్చుకోవాలి. అందాలు ఆరబోతకి సిద్ధంగానే ఉండాల్సి ఉంటుంది.  కీర్తి ఇప్పుడు అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. తనని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునే పనిలో పడింది.

78

ఈ విషయంలో రష్మిక మందన్నా(Rashmika Mandanna)ని ఫాలో అవుతుందని టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే రష్మిక మందన్న `ఛలో`, `గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌`, `దేవదాస్‌` చిత్రాల్లో హోమ్లీ బ్యూటీగా కనిపించింది. కానీ రెండు సినిమాలు పోయాయి. దీంతో `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`లో కాస్త గ్లామర్‌ సైడ్‌ ట్రై చేసింది. అది వర్కౌట్‌ అయ్యింది. ఇటీవల బన్నీతో చేసిన `పుష్ప`లో మరింత బోల్డ్ గా చేసింది. అందాలు దాచుకోకుండా చూపించేసింది. మరోవైపు వరుసగా హాట్‌ ఫోటో షూట్లతోనూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. నేషనల్‌ క్రష్‌గా ఎదిగింది. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతుంది. 

88

తాను కూడా రష్మిక లాగా రాణించాలని టార్గెట్‌ పెట్టుకుంటున్నట్టుంది కీర్తి.  గ్లామర్‌ విషయంలోనూ తగ్గేదెలే అనేలా ఉండాలని తెలుసుకున్నట్టుంది. నెమ్మదిగా తను ఓపెన్‌ అవుతుంది. గ్లామరస్‌గా కనిపించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని ఫోటో షూట్లలో హాట్‌గా దర్శనమిచ్చింది. `సర్కారు వారి పాట` ప్రమోషన్స్ లోనూ హాట్‌ హాట్‌గా ముస్తాబై హోయలు పోయింది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. మొత్తంగా కీర్తిసురేష్‌ నెక్ట్స్ టార్గెట్‌ పెద్దగానే పెట్టుకుందని అంటున్నారు నెటిజన్లు. మరి ఆమె కెరీర్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అన్నట్టు నెక్ట్స్ కీర్తి తెలుగులో నానితో `దసరా` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories