Guppedantha Manasu: ప్రేమలేఖకు ఫిదా అయిన వసు.. అది నేనే రాశాను అంటూ గట్టిగా అరిచిన రిషి?

Navya G   | Asianet News
Published : Jan 12, 2022, 11:42 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యం లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: ప్రేమలేఖకు ఫిదా అయిన వసు.. అది నేనే రాశాను అంటూ గట్టిగా అరిచిన రిషి?

వసు (Vasu) కు లవ్ లెటర్ రావడంతో జగతి దాని గురించే ఆలోచిస్తుంది. అదే సమయంలో మహేంద్రవర్మ అక్కడే ఉండటంతో ఆయనకు కూడా కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన విషయం చెబుతుంది. ఇక మహేంద్ర (Mahendra) ఆశ్చర్యపోతూ ఎవరో రాసారులే అన్నట్లు మాట్లాడతాడు.
 

27

కానీ జగతి (Jagathi) మాత్రం అదే విషయం గురించి ఆలోచిస్తుంది. ఆ రైటింగ్ ఎక్కడో చూశాను అని అనటంతో మహేంద్ర ఎంతో మంది స్టూడెంట్స్ వి చూస్తూ ఉంటావు కదా అని అంటాడు. కానీ రిషి బాధపడుతున్నట్లుగా అనిపిస్తుందేమో అని రిషి (Rishi) గురించి మాట్లాడుతుంది.
 

37

ఇక ఛాన్స్ మిస్ అయినందుకు గౌతమ్ (Gautham) తనలో తాను మాట్లాడుకుంటుండగా దేవయాని (Devayani) వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. గౌతమ్ మాట మారుస్తూ మాట్లాడుతాడు. గౌతమ్ ను ఒక విషయం అడగాలని అనుకుంటుంది. ఇక గౌతమ్ ను అడుగుతూ తర్వాత అడుగుతానులే అని అంటుంది.
 

47

మరోవైపు వసు (Vasu), రిషి ఓ చోట ఉంటారు. ఇక రిషి తన మనసులో వసు లవ్ లెటర్ గురించి పిలిచిందని అనుకుంటాడు. అంతలోనే వసు ఆ టాపిక్ చేయటంతో కాస్త టెన్షన్ పడతాడు. కానీ వసుకి ఆ లవ్ లెటర్ రాసిన విధానం నచ్చటంతో ఆ లెటర్ బాగుందని చెబుతుంది. దానికి రిషి (Rishi) ఆశ్చర్యపోతూ ఉంటాడు.
 

57

నవ్వాలా, ఏడువాలా అర్థం కాదు అన్నట్లుగా ఉంటాడు. లవ్ లెటర్ లోని పదాలను వసు (Vasu) వివరిస్తూ ఉంటుంది.  తన గురించి బాగా తెలిసిన వ్యక్తులే తనకు రాశారని అంటుంది. ఎందుకో ఆ వ్యక్తిని చూడాలనిపిస్తుంది అని అంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి నేరుగా వచ్చి ఇస్తే లవ్లీ ఆక్సెప్ట్ చేసే దానివా అని రిషి (Rishi) అడుగుతాడు.
 

67

లేదు సార్ అని అంటూ కానీ అందులో రాసిన అర్థం బాగుందని.. ఆ రాసిన వాళ్ళు ఎవరో చూడాలని ఉంది అంటూ పొంగిపోతుంది. అలా కాసేపు వారి మధ్య సరదాగా గడుస్తుంది. మరోవైపు మహేంద్రవర్మ (Mahendra Varma) రిషి (Rishi) ఫోటోని చూసుకుంటూ తన మనసులో ఏముందో అని ఆలోచనలో పడతాడు.
 

77

ఇక వసును రిషి (Rishi) కారులో డ్రాప్ చేస్తాడు. వసు మొఖం లో సంతోషాన్ని చూసి జగతి కూడా సంతోషంగా ఉంటుంది. ఇక రిషి ఆ లవ్ లెటర్ రాసింది నేనే అంటూ రోడ్డుపై గట్టిగా అరుస్తాడు. తరువాయి భాగం లో వసు (Vasu) ను రిషి ఇంటికి పిలవటంతో దేవయాని తో పాటు అందరూ షాక్ అవుతారు.

click me!

Recommended Stories