సమంత, చైతు బ్రేకప్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ప్రీతమ్. సమంత, ప్రీతమ్ లపై అనేక ఆరోపణలు వినిపించాయి. ఆ టైం లో సమంత మానసికంగా కుంగిపోయిన సంగతి తెలిసిందే. సమంత తన సోదరితో సమానం అంటూ ప్రీతమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. కానీ ప్రీతమ్ వల్లే సమంత, చైతు మధ్య విభేదాలు తలెత్తాయని అతడిని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇక సమంత ఆ చేదు జ్ఞాపకాల నుంచి దూరం అవుతూ యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది.