
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, వసుధారని గట్టిగా తిడుతూ ఉంటాడు.అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మెసేజ్ పెట్టి ఇక్కడ ఆకాశంతోనీ ఆకులతోనీ కథలు చెబుతూ కూర్చుంటే ఎదుటి వాళ్ళు ఎలా భయపడతారు అనేది లేదా నీకు అని అంటాడు. అప్పుడు వసుధార, నాకు మీతో మాట్లాడాలని ఉంది సార్, కానీ మీరు రారు ఎందుకంటే మీరు మారిపోయారు. మీరు అప్పటి రిషి సార్ కాదు అని వసు అంటుంది. అప్పుడు రిషి జీవితంలో మార్పు సహజం ఋతువులకి ఆకులు చెట్లు మారుతాయి. అలాగే మనుషులు కూడా తగిన సమయంలో మారాల్సి ఉంటుంది అని అంటాడు. ఈలోగా రిషి వసుని,నువ్వు నన్ను ఏ ప్రశ్న అడగకుండా నీటిగా వెళ్లి కారులో కూర్చొ అంటాడు. అప్పుడు వసు ఇంటి తలుపులు వేసి కారులో కూర్చోబెడతాడు రిషి.
ఈ లోగా ఇంట్లో మహీంద్రా, రిషి ఏవైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా? లేకపోతే తన మనసుని బాధపెట్టుకొని పెళ్లికొప్పుకున్నాడ? అని అనగా జగతి, నా కొడుకు అంత పిరికోడేమీ కాదు అని అంటుంది.ఈ లోగ మహీంద్రా,అయినా రేపు లగ్నపత్రిక పెట్టుకోమని చెప్పాడు కదా ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు అని అంటాడు. ఈలోగా అక్కడికి ఒక కార్ శబ్దం వస్తుంది. అదిగో రిషి వచ్చాడు అని అంటాడు మహీంద్రా. రిషి తో వసు కూడా ఇంటికి వస్తుంది .అప్పుడు రిషి వాసుధార ఈరోజు నుంచి ఇక్కడే ఉంటుంది.దానికి ఏర్పాట్లు చేయమని వదినకు చెప్పండి అని లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం గౌతం రిషి గదిలోకి వస్తాడు. అప్పుడు రిషి పడుకుని ఉంటాడు. ఇంత జరుగుతున్నా ఇంత హాయిగా ఎలా పడుకుంటున్నావు? అని మనసులో అనుకొని రిషిని వెళ్లి లేపుతాడు. ఎందుకు? ఏంటి? అని ప్రశ్నలుంటే ఇప్పుడే వెళ్లిపో అని అంటాడు రిషి. వసుధార ఎక్కడికి ఎలా వచ్చింది అని అనగా నేనే తీసుకొచ్చాను అని అంటాడు రిషి. అదే సమయంలో ఆ మాటలు సాక్షి విని మంచి పని చేశావు రిషి.
నేనే తనని రమ్మందాం అనుకున్నాను. నువ్వే ఆ పని చేశావు అని అంటుంది. ఈ మాటలు దేవయాని విని సాక్షికి ఏమైనా మతిపోయిందా? అని సాక్షి దగ్గరికి వెళ్లి అసలు ఏం చేస్తున్నావు సాక్షి వసుధార పక్కనుంటే రిషి మనసు మార్చుకుంటాడేమో అని అంటుంది. అప్పుడు సాక్షి అలా ఏం జరగలదు ఆంటీ అని అంటుంది. ఇది చూసి వసుధార కుళ్ళుకుంటది. రిషి మనసు మారిపోవడానికి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత సాక్షి రిషికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. రిషి సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. అప్పుడు సాక్షి మనసులో, పెళ్లికి ఒప్పుకున్నాడు గాని అసలు ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదు.ఏదైతే అది అయింది నాకు దక్కలనుకున్నది నాకు దక్కింది కదా అని ఆనందపడిపోతూ ఉంటుంది సాక్షి. అప్పుడు దేవయాని, రిషి పెళ్లి పనులు అన్ని అంత హడావిడిగా చేయొద్దు అన్నాడు కదా మామిడి తోరణాలు కట్టాలి వెళ్ళు కట్టు గౌతం అని అంటుంది.
అప్పుడు గౌతమ్ ఏదో ఇష్టం లేనట్టుగా మామిడి తోరణాలు కడుతూ ఉంటాడు. అంతట్లో వసు అక్కడికి వచ్చి ఏ పనైనా కలగా మనసుపెట్టి చేయాలి సార్. అప్పుడే బాగుంటుంది అని చెప్పి తన చేతిలో నుంచి ఆ పని తీసుకొని తోరణాలు ద్వార బంధానికి కడుతుంది వసు. అప్పుడు గౌతమ్, నాకే చేయి రావట్లేదు ఈ పనులు చేయడానికి నువ్వెందుకు చేస్తున్నావ్ వసుధార అని అడగ్గా కాకరకాయ కారంగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది. అలాగే మన జీవితంలో కూడా మంచి కోసం ఇష్టం లేని పనులు చేయాలి. అందులోని ఇది రిషి సార్ ఇంట్లో ఫంక్షన్ ఎంత హడావిడి చేయాలి, నేను ఇదంతా బాగా చేసి రిషి సార్ ఎవరు చేశారు ఇది? అంటే నేను గర్వంగా చెప్పుకోవాలి కదా అని అంటుంది. ఈ మాటలు జగతి విని మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి అంత నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు వసు అని అనుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో దేవయాని సాక్షి దగ్గరికి వెళ్లి వసుధార నీ ఇంటి నుంచి పంపించేద్దాం అంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అంటుంది. మీరేం భయపడొద్దు అది కుళ్ళుకోవాలి. అది ఏం చేయలేదు, ఇప్పుడు తను చనిపోయిన పాము కేవలం తోక మాత్రమే ఉంటుంది.అయిన మా అమ్మానాన్నలు పంతులు గారి దగ్గరికి వెళ్లారు ఇంకో గంటలో లగ్నపత్రిక అయిపోతుంది కంగారు పడాల్సిందేమీ లేదు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మహేంద్ర రిషి దగ్గరికి వచ్చి ఏవో పార్సెల్ వచ్చాయి నీకు అని ఇస్తాడు. ఇప్పుడు ఓపెన్ చేయొద్దు అని రిషి అంటాడు. అప్పుడు మహీంద్రా,కాబోయే పెళ్లికూతురుకా?అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా రిషి. ఒక తప్పు చేస్తే తిరిగి దిద్దుకోవచ్చు. కానీ ఇది ఒక జీవితం ఒకసారి తప్పు జరిగితే మళ్ళీ కోలుకోలేము ముందే ఆలోచించుకోవాలి అని అంటాడు. అప్పుడు రిషి డిబిఎస్టి కాలేజీకి మీరు ఎండిగా ఉంటారా? అని అడుగుతాడు.
నేనేం మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆ స్థానం నాది కాదు. నేను అర్హుడ్ని కాదు అని అంటాడు. అప్పుడు రిషి, ఒక విద్యాసంస్థకు ఎండి అయిన నేను చాలామందికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాను. అలాంటి నేను ఇప్పుడు నా మనసు మార్చుకుంటే ఆదర్శంగా అవ్వగలనా? అని అంటాడు. ఈ లోగా అక్కడికి జగతి వస్తుంది. మీరు డిబిఎస్టి కి ఎండిగా ఉంటారా? అని అడుగుతాడు అప్పుడు జగతి,ఒక బిడ్డనే పెంచలేని నేను అంత పెద్ద భారాన్ని భుజం మీద ఎలా మోయగలను? అయినా నాకు ఆ అర్హత లేదు. మహేంద్ర భూషణ్ భార్య గాను, దేవేంద్రభూషన్ కోడలుగాను నాకు ఆ హక్కు లేదు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!