#MacherlaNiyojakavargam: USA ప్రీమియర్ షోలన్నీ రద్దు..కారణం ఇదీ

First Published Aug 12, 2022, 8:27 AM IST

హీరో నితిన్ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చివరిగా భీష్మ సినిమాతో  సక్సెస్ అందుకున్నారు. ఈ రోజు ఆయన మాచర్ల నియోజకవర్గం తో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వాస్తవానికి ఈపాటికి అమెరికాలో షోస్ నుంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ షోలు పడిపోతాయి. కానీ పడలేదు. 

Macherla Niyojakavargam

వాస్తవానికి ఈపాటికి అమెరికాలో షోస్ నుంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ షోలు పడిపోతాయి. కానీ పడలేదు.  అందుకు కారణం టెక్నికల్ రీజన్స్ అని తెలుస్తోంది. KDMలు ( సినిమాలు వచ్చే హార్డ్ డిస్క్ లాంటిది) కు సంభందించిన ఇష్యూ అని తెలుస్తోంది.సినిమాలు ప్లే అవ్వాలంటే కీ డెలివరీ మెసేజ్ అనే ఒక పాస్వర్డ్ ఉండాల్సి ఉంటుంది. కానీ అవి రాకపోవడంతోని అమెరికాలో షోలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మొదటి షో భారత కాలమానం ప్రకారం 6:30 గంటలకు అమెరికాలో ప్రారంభం కాబోతోంది.  దీంతో ట్విట్టర్ రివ్యూలు కూడా బయటకు రాలేదు.

మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్‌కి వస్తారు. రీసెంట్‌గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్‌, కృతిశెట్టి జంటగా ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'.

 బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌ కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 


 ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ రెడ్డి అనే ఒక ఐఏఎస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నిఖితారెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా ట్రైలర్, టీజర్ సహా ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద అంచనాలు పెంచాయి.  ఈ సినిమా మీద నితిన్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. 


నితిన్ మాట్లాడుతూ...కమర్షియల్ సినిమా అయినప్పటికీ.. ఇందులో ఉండే కథ చాలా యూనిక్‌గా ఉంటుంది. పొలిటికల్ నేపధ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్లలో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది. కమర్షియల్ ఫార్మెట్‌లో ఉంటూనే కొత్త పాయింట్‌తో వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్‌లో చాలా ఫ్రెష్‌నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ వున్నాయి. ఫ్యాన్స్‌కి  పండగలా వుంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్‌కి వెళ్తా అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోబోతోంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.  

ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్‌ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్‌ హీరోల స్టెప్పులను సింక్‌ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్‌ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.  ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌లో చూపించిన డైలాగ్‌లు, నితిన్ ‍యాక్షన్‌ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్‌ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్‌ను ట్వీట్‌ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్‌గా నిటిస్తున్న విషయం తెలిసిందే. 

దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లు ఇటీవల పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమ్మ - కాపు కులాలను దూషిస్తూ ట్వీట్లు పెట్టినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే వైఎస్సార్సీపీ కి సపోర్ట్ గా.. టీడీపీ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినట్లు ట్వీట్లు ఉన్నాయి. ఇవి ఫేక్ ట్వీట్సా లేదా ఒరిజినలా అని ఆలోచించేలోపే మాచర్ల దర్శకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయా వర్గాలవారు విపరీతంగా ట్రోల్ చేశారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాని బాయ్ కాట్ చేయాలని.. మాచర్ల ముచ్చట్ల పేరుతో ట్విట్టర్ క్యాంపైన్ చేశారు. అయితే దర్శకుడు వాటిని ఖండించారు.

Macherla Niyojakavargam

అవన్నీ ఫేక్ పోస్టులు అని.. ఎవరూ నమ్మవద్దని కోరాడు. ఎవరో కావాలని ఎడిట్ చేసి తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాడు. అతనికి నితిన్ సైతం మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎస్ ఆర్ శేఖర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.తన పేరు మీద నకిలీ ట్వీట్లు సృష్టించి.. కులాలు వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి పోలీసులను కోరారు. ఇది జరిగి కూడా రెండు వారాలు కావొస్తుంది. కేసు ఏమైంది? ఆ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? అనేది ఎవరికీ తెలియదు.

 'అ ఆ' తరువాత మూడు ప్లాప్స్ అందుకున్న నితిన్.. 'భీష్మ' సక్సెస్ తర్వాత 'చెక్' 'రంగ్ దే' చిత్రాలతో నిరాశ పరిచాడు. గతేడాది ద్వితీయార్థంలో వచ్చిన 'మ్యాస్ట్రో' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ లెక్కలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ''మాచర్ల నియోజకవర్గం'' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో వస్తున్నారు.

 ప్రతినాయకుడి పాత్ర  చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్‌గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్‌ జరగలేదు. చివరికి ఉదయ్‌శంకర్‌ అనే ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్‌ జరిగేలా చేశారు. ఈ అంశాన్ని రాజశేఖర్‌తో షేర్‌ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్‌లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్‌ఫాదర్‌, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. 

click me!