ఎపిసోడ్ ప్రారంభంలో జైల్లో ఖైదీలకి మోటివేషనల్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు రిషి. కోపం అందరికీ ఉంటుంది కానీ మృగాలు మంచి చెడుని విశ్లేషించలేవు ఆ జ్ఞానం ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. ఐదు నిమిషాలు కోపాన్ని జయించ గలిగితే భవిష్యత్తు అంతా మన చేతిలోనే ఉంటుంది అంటాడు రిషి. నిజమే సార్ ఆస్తికోసం నా అన్నని చంపాలి అనుకున్నాను కొద్దిలో తప్పిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈపాటికి నాకు అన్న లేకుండా పోయేవాడు.