పంచెకట్టులో శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. ఆలయం వద్ద ఫ్యాన్స్ సందడి

First Published | Jun 6, 2023, 9:36 AM IST

నిన్నరాత్రే తిరుమలకు చేరుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈరోజు వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. పంచెకట్టు, పట్టు వస్త్రాల్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజే సాయంత్రం ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రమోషన్  యూనిట్ పూర్తి చేసి సిద్ధంగా ఉంది. 
 

మరోవైపు నిన్న రాత్రే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో పాటు ‘ఆదిపురుష్’ టీమ్ తిరుమలకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న సందర్భంగా ప్రభాస్, ఆదిపురుష్ టీమ్ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 


ప్రభాస్ తెల్లటి పట్టు వస్త్రాల్లో తేజస్సుతో వెలిగిపోయారు. పంచెకట్టు, కుర్తా ధరించి భక్తి, శ్రద్ధలు చూపించారు. ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించారు. సుప్రభాత  సేవలోనూ ప్రభాస్ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. 
 

దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల నుంచి పాన్ ఇండియా స్టార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అభిమానులు తిరుమలలో సందడి చేస్తున్నారు. డార్లింగ్ తో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. కానీ అధికార సిబ్బంది వారిని నివారించింది. 
 

సాయంత్రం తారకరామ స్టేడియంలో జరిగనున్న ఆదిపురుష్ ఈవెంట్ కు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రభాస్ తిరుమలలోనే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉండనున్నారు. బస చేసిన తర్వాత ఈవెంట్ కు బయల్దేరనున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఈవెంట్ ను భారతీయ సినీ చరిత్రలోనే ముందెన్నడూ లేనివిధంగా నిర్వహించబోతున్నారు. చీఫ్ గెస్ట్ గా మతగురువు, ఆధ్యాత్మిక ప్రవన కర్త చిన జీయర్ స్వామి హాజరు కానున్నారు. ఇక ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అయోధ్య భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.  లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరు అయ్యే ఛాన్స్  ఉంది.
 

Latest Videos

click me!