అప్పుడు వసు మనసులో, ఈవిడ దీనికోసమే అడుగుతున్నారా లేకపోతే ఏమైనా ఆలోచనలు ఉన్నాయని అనుకుంటుంది.అప్పుడు దేవయాని, నిన్ను అడుగుతున్నానని నాకు ఏదైనా ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నావు ఏమో,నాకు ఏ ఉద్దేశమూ లేదు, కేవలం ఇంట్లో పండగ కోసమే అని అంటుంది దేవయాని. మీరు చెప్పింది మంచే మేడం,రిషి సార్ నీ ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను అని అంటుంది వసుధార. అప్పుడు దేవయాని మనసులో, ఈ మాత్రం నిప్పు పెడితే మంటలు వచ్చేలా నేను చేస్తాను అనుకుంటుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు.