Karthika Deepam: మోనిత మీద అరిచిన కార్తీక్.. శౌర్యను చూసి వణికిపోయిన మోనిత!

Published : Sep 08, 2022, 07:23 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 8వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

PREV
17
Karthika Deepam: మోనిత మీద అరిచిన కార్తీక్.. శౌర్యను చూసి వణికిపోయిన మోనిత!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప, మోనిత తో, నేను తప్పు చేయలేదు అని ప్రమాణం చేశాను కదా అలాగే నువ్వు కూడా తప్పు చేయలేదని ప్రమాణం చేయు అని అంటుంది.అప్పుడు కార్తీక్ తను చెప్పేది కూడా నిజమే కదా, ఇటు మాట్లాడుతుంటే అటు పెట్టావ్ చూస్తున్నావ్ ఏంటి అని అంటాడు. అప్పుడు దీప, తప్పించుకోవడానికి వంకలు వెతుకుతుంది. ముందు ప్రమాణం చేయ అని అనగా మొనిత,నేను ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. అయినా నేనెందుకు నా మాట నిరూపించుకోవాలి రా కార్తిక్ అని బలవంతంగా కార్తీక్ ని తీసుకొని వెళ్ళిపోతుంది మోనిత.
 

27

ఆ తర్వాత సీన్ లో వారణాసి,సౌర్య తిరిగి ఇంటికి వెళ్లి పోతారు. ఆ తర్వాత సీన్లో కారులో మోనిత,మొన్న ఆంటీ అంకుల్ కనిపించారు. నిన్న దీప, ఈరోజు సౌర్య అందరూ ఇక్కడే ఉన్నారు. కార్తీక్ లేడని బాధతో అందరూ కుమిలి కుమిలి ఏడుస్తారు అనుకుంటే, అందరూ ఇక్కడికి వచ్చి చచ్చారు ఏంటి.అయిన దీపా,కార్తీక్ బతికి ఉన్నారని వాళ్లకు తెలుసా.ఆంటీ కి కార్తీక్ న దగ్గర ఉన్నాడని తెలిస్తే, నాలుగు తగిలించి కొడుకు అని లాక్కెళ్ళిపోతారు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి ఎందుకు మొనిత.
 

37

 అయినా ఆ వంటలక్క తప్పు చేసింది అని నేను అనుకోవడం లేదు. అంత మొండిగా ప్రమాణం చేసిందంటే తప్పు చేయలేనట్టే కదా,అయినా నువ్వు ఎందుకు ప్రమాణం చేయలేదు అని అడగగా మొనిత, కోపంతో కార్ ఆపు కార్తీక్ అని కార్ ఆపించి బయటకు దిగి,ఆ వంట లక్క,నేను ఒకటేనా కార్తీక్ అయినా నా మాట నిజమని నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకనుంచి నువ్వు తనతో మాట్లాడకూడదు తన ప్రస్తావన తేకడదు అని నాకు మాట ఇవ్వు అని అంటుంది.
 

47

దానికి కార్తీక్ చిరాకు పడి, అయినా నేను ఎందుకు నీకు మాట ఇవ్వాలి నువ్వు చెప్పింది అంతా వినాలి. నువ్వు నా భార్యవా లేకపోతే టీచర్ వా. అంత గట్టిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను, నేను మాట ఇవ్వను అని చెప్పి మొనిత నీ  నడిరోడ్డులో వదిలేసి కార్లో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో, వారణాసి,శౌర్య లు  రోడ్డు బయట ఇడ్లీ తింటూ ఉంటారు. అప్పుడు వారణాసి సాంబారు చట్నీ కలిపి తింటున్నావ్ ఏంటమ్మా అయినా ఇదేనా నువ్వు ఇచ్చే పార్టీ అని అడగగా శౌర్య, ఇది పార్టీ కాదు వారణాసి.అమ్మ నాన్నలు వచ్చే వరకు నేను ఏ పుట్టినరోజు ఏ పండగలు జరుపుకోను.
 

57

 నాకు అవి ఏమీ వద్దు అని అనుకుంటుంది. అప్పుడు వారణాసి అందరూ ఉండి అనాదగా ఉండడం అంటే ఇదేనమ్మా అని మనసులో అనుకుంటాడు. అప్పుడు శౌర్య గతంలో కార్తీక్ కి సాంబార్ చట్నీ కలిపి ఇడ్లీ తినిపిస్తున్న సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది. చిన్నప్పుడు నేను అమ్మాయి ఇద్దరమే ఉండేవాళ్ళము నాన్న ఎవరో తెలీదు. తర్వాత నాన్న, నానమ్మ, తాతయ్య, అందరూ మధ్యలో వచ్చారు. అంతా బాగుండేది అందరం కలిసి బాగా గడిపే వాళ్ళం దాని తర్వాత మళ్లీ వాళ్లు వెళ్లిపోయారు.దేవుడు నా జీవితంలో ఒకేసారి ఉప్పెనంత ఆనందాన్ని ఇచ్చి లాగేసుకున్నాడు.
 

67

వాళ్లు ప్రతిరోజు గుర్తొస్తారు, ఈ రోజు పుట్టినరోజు ఇంకా గుర్తొస్తున్నారు అని ఏడుస్తుంది శౌర్య. ఆ తర్వాత సీన్లో దీప డాక్టర్ వల్ల ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది.అప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మగారు నువ్వు ప్రమాణం చేసినందువల్ల కార్తీక్ కి  నువ్వు తప్పు చేయలేదని తెలిసింది కదా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళు నీ ప్రయత్నాలు నువ్వు చేయు అని అంటుంది. దానికి దీప ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి మొనితా తన వలలో వేసుకుంటుంది. అయినా నేను ప్రయత్నం ఆపకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. అప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మగారు డాక్టర్ తో, మొనిత ని మనం ఏం చేయలేమ? అని అడగగా  డాక్టర్, కార్తీక్ గతం గుర్తు రాకుండా మొనిత ని మనం ఏమైనా చేస్తే జీవితాంతం మోనిత, లేదని బాధపడుతూనే ఉంటాడు కార్తీక్. దానికన్నా గతం గుర్తొస్తే మంచేదో చెడేదో తెలుసుకుంటే మంచిది అని డాక్టర్ అంటాడు.
 

77

ఆ తర్వాత సీన్లో కార్తీక్ మోనిత మీద కోపంతో కారులో వచ్చేస్తాడు. కానీ దారిలో ఇంటికి వెళ్లే దారి మర్చిపోతాడు. కార్దిగి బయటకు వెళ్లి చూస్తాడు. ఆ తర్వాత సీన్లో మోనిత బోటిక్ లోకి వచ్చి కార్తిక్ ఎక్కడున్నాడు అని చూస్తుంది.  అప్పుడు మోనిత ఇంట్లో దీప,కార్తీక్ నుదిటి మీద భామ్ రాస్తూ కనిపిస్తుంది.అప్పుడు మొనిత, కోపంగా అసలు ఇక్కడ మీరిద్దరూ ఏం చేస్తున్నారు .అయినా దీంతో మాట్లాడొద్దని చెప్పాను కదా కార్తీక్. మొన్న టిఫిన్ లో విషం కలిపింది నా ప్రాణాలు మీదకు వచ్చింది అయినా సరే మాట్లాడుతున్నావా అని అడుగుతుంది మోనిత. అప్పుడు కార్తీక్, అయిన ప్రమాణం చేసింది కదా తన తప్పేం లేదని నేను నమ్ముతున్నాను ఎందుకు ప్రతిసారి వంటలక్క మీద పడుతున్నావు. అయినా ఈరోజు తను లేకపోతే నేను నీకు దక్కేవాళ్ళు కాదు అని కార్తీక్ అంటాడు.  ఏమైంది అని మొనిత, అనగా కార్తీక్ ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ తనకి గుర్తుండదు. అప్పుడు దీప నీ చెప్పమంటాడు. దీప, ఇందాకే జరిగింది కదా డాక్టర్ బాబు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని అంటుంది. కార్తీక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories