మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటూ పలకరిస్తాడు. మనం లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం సార్ అంటాడు రిషి. సరే అంటూ రిషి ని, వసుని తన రూమ్ కి తీసుకు వెళ్తాడు ఎస్సై. ఇదంతా చూస్తున్నా కేడి బ్యాచ్ వీళ్లు వచ్చారేంటిరా మీ నాన్న రాలేదు ఏంటి అని పాండ్యన్ ని అడుగుతాడు వాడి ఫ్రెండ్. మా నాన్న ఫోను కలవలేదు అయి ఉంటుంది అందుకే కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు అంటాడు పాండ్యన్.