రాకేష్ మాస్టర్ పరిశ్రమలో ఉనికి కోల్పోయాడు. ముక్కుసూటిగా మాట్లాడటం, లౌక్యం తెలియకపోవడంతో రాకేష్ మాస్టర్ కి శత్రువులు ఎక్కువయ్యారు. ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. టాలెంట్ ఉన్నా కెరీర్లో ఎదగలేకపోయాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయ్యాడు.
యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలతో రాకేష్ మాస్టర్ బాగా పాప్యులర్ అయ్యాడు. స్టార్ హీరోలను, ప్రముఖులను పచ్చి బూతులు తిడుతూ ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ ఆయన వెంటబడ్డాయి. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అప్పుడు రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు.