ఎపిసోడ్ ప్రారంభంలో లాస్య పీడ వదిలిపోయినందుకు ఆనందపడుతూ ఉంటారు తులసి వాళ్ళు. ఇంతలోనే రాములమ్మ వాళ్ళ దగ్గరికి రాబోతుంది. ఆమె జుట్టు పట్టుకుని నాకే నమ్మకద్రోహం చేస్తావా అంటూ నిలదీస్తుంది లాస్య. అది నీ దగ్గరే నేర్చుకున్నాను తులసమ్మతో మంచిగా ఉంటూ నందు బాబుని లాక్కున్నావు అది నమ్మకద్రోహం కాదా? డబ్బుకు ఆశపడి దివ్య జీవితాన్ని తాకట్టు పెట్టావు అది నమ్మకద్రోహం కాదా అంటూ నిలదీస్తుంది రాములమ్మ.