Kantara 3: కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన 'కాంతార' ఫ్రాంచైజీ తర్వాతి భాగం గురించి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అదిరిపోయే వార్త చెప్పారు.
కాంతార అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ ఫ్రాంచైజీ తర్వాతి భాగం గురించి నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కీలక సమాచారం పంచుకున్నారు. 'కాంతార: చాప్టర్ 1' తర్వాత, ఇప్పుడు తర్వాతి సినిమా స్క్రిప్ట్ (కాంతార 3) పనులు మొదలయ్యాయని, తన రైటర్స్ టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
24
రైటర్‌గానే సంతృప్తి
ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడారు. దర్శకత్వమే తన అసలైన ప్యాషన్ అని ఆయన చెప్పుకొచ్చారు. కథ రాసే ప్రక్రియలోనే తనకు ఎక్కువ సంతృప్తి లభిస్తుందని, తర్వాతి భాగాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.
34
కాంతార 3 కథ ఇదే
కాంతార తర్వాతి భాగంలో కూడా దైవ శక్తులే కథకు కేంద్ర బిందువుగా ఉండనున్నాయి. రాజకుటుంబం, గిరిజన సమాజం మధ్య సంఘర్షణ మరో స్థాయికి చేరనుంది. కొత్త తరం కథతో దైవం, నమ్మకం, సంప్రదాయాల పోరాటాన్ని చూపించే అవకాశం ఉంది. గత భాగంలో కనిపించిన సంఘర్షణకు కొనసాగింపుగా, ఈ భాగాన్ని మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోందని రిషబ్ శెట్టి వెల్లడించారు.
దర్శకత్వంతో పాటు నటనలోనూ రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో రెండు పాన్-ఇండియా సినిమాలు ఉన్నాయి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని 'జై హనుమాన్' సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' అనే చారిత్రక చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో, వేర్వేరుగా శారీరకంగా సిద్ధమవ్వాల్సి ఉందని, లుక్ కూడా మారుతుందని రిషబ్ చెప్పారు. మొత్తానికి, కాంతార సిరీస్ తర్వాతి భాగం పనులు అధికారికంగా మొదలవ్వడంతో అభిమానుల్లో కొత్త అంచనాలు మొదలయ్యాయి.