రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటనకు ప్రశంసలందుకున్న ఈ మూవీ ఇప్పుడు భారీ నష్టాలతో ముగుస్తుంది.
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` సినిమా రూపొందింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. వెంకట సతీష్ కిలారు నిర్మాత. `గేమ్ ఛేంజర్` వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేసిన చిత్రమిది. గత జూన్ 4న ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలానే కలెక్షన్లు ఉన్నాయి.
25
థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకున్న పెద్ది మూవీ
`పెద్ది` మూవీ ప్రారంభంలో జోరు చూపించింది. మొదటి వారం రెండో వారంలో మంచి వసూళ్లని రాబట్టింది. మూడో వారం నుంచి డ్రాప్ అయ్యింది. దీనికితోడు సమంత నటించిన `మా ఇంటి బంగారం` రావడంతో `పెద్ది`కి గట్టి దెబ్బ పడింది. కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇక ఈ మూవీ ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. కాకపోతే ఆల్మోస్ట్ క్లోజింగ్‌కి చేరుకుంది. కొన్ని థియేటర్లలో మాత్రమే రన్ అవుతుంది. అది కూడా రోజుకి ఒక్క షో మాత్రం తిప్పి కొడితే అన్నీ కలిపి 10 థియేటర్లు కూడా లేవు. దీంతో ఇక థియేట్రికల్ గా `పెద్ది` క్లోజింగ్‌కి చేరుకుందని చెప్పొచ్చు.
35
పెద్ది మూవీ ఎన్ని కోట్ల నష్టాలు అంటే?
పెద్ది థియేట్రికల్‌గా 35 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.341 కోట్ల కలెక్షన్లు(సాక్నిల్క్ లెక్కల ప్రకారం) వచ్చాయి. ఇందులో ఇండియా గ్రాస్ రూ.288కోట్లు ఉండగా, రూ.243.83కోట్ల నెట్ ఉంది. ఓవర్సీస్‌లో ఈ మూవీ రూ.53కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ చిత్రం సుమారుగా రూ.170కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.220కోట్లు రావాలని ట్రేడ్ వర్గాల సమాచారం. హిట్ అవ్వాలంటే ఇంకా రూ.50కోట్లు రావాలి. మొత్తంగా ఈ మూవీ యాభై కోట్ల నష్టాలతో ముగుస్తుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం కొన్ని థియేటర్లో రన్ అవుతుంది. అయితే ఆ కలెక్షన్లు కేవలం థియేటర్ ఖర్చులకే సరిపోవు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లని దాటుకొని నిర్మాతకు వచ్చేది సున్నా. మొత్తంగా ఈ సినిమా రూ.50కోట్ల నష్టాలతో ముగుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. `పెద్ది` బ్లాక్ బస్టర్ గా టీమ్ చెబుతూ వచ్చింది. కానీ నిర్మాత మాత్రం గట్టిగానే లాస్ అయ్యాడని సమాచారం. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు స్థాయి పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. మరి అవార్డు వస్తుందా అనేది చూడాలి.
55
సమంత మూవీ లాభాలు, రామ్ చరణ్ మూవీ నష్టాలు సేమ్
అయితే సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి రూ.90కోట్లకుపైగానే వసూళ్లు వచ్చాయి. రిలీజ్‌కి ముందే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. రూ.5 కోట్ల లాభాలు వచ్చాయి. ఇక థియేట్రికల్‌గా వచ్చిందంటే లాభమే. ఈ లెక్కన ఈ మూవీకి థియేట్రికల్‌గా రూ.45కోట్ల షేర్ వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో మరో ఐదు కోట్లు లాభాలు ఇలా మొత్తంగా సమంతకి `మా ఇంటి బంగారం` మూవీ ద్వారా రూ.50కోట్లు లాభాలు రావడం విశేషం. ఇలా రామ్ చరణ్ మూవీ నష్టాలు, సమంత మూవీ లాభాలు ఈక్వల్‌గా ఉండటం విశేషం.