రష్మిక చేసిన అతికి రిషబ్‌ శెట్టి దిమ్మతిరిగే కౌంటర్‌.. సమంతకి హైప్‌ ఇచ్చి నేషనల్‌ క్రష్‌పై సెటైర్లు

Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్‌గానే కాదు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఆమె చేసిన ఓ పనికి రిషబ్‌ శెట్టి ఇచ్చిన కౌంటర్‌ క్రేజీగా మారింది. 

Rashmika Mandanna:

Rashmika Mandanna:  బెంగళూరులో చదువుతున్న ఒక సాధారణ అమ్మాయికి అవకాశం ఇచ్చి, ఆమెలో దాగి ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా రిషబ్ దర్శకత్వం, రక్షిత్ హీరోగా నటించిన 'కిరిక్ పార్టీ'.

ఈ సినిమాతో రష్మిక మందన్న అనే కూర్గ్‌ అమ్మాయి రాత్రికి రాత్రే కన్నడనాట స్టార్‌ అయిపోయింది. `కిరిక్ పార్టీ`లోని ఈ కన్నడ క్రష్ స్టైల్, స్మైల్‌ను ప్రజలు మనసారా మెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత రష్మికకు వరుసగా సినిమాలు వచ్చాయి. 

Rishab Shetty Reacted to Rashmika Mandannas Finger Quotes Statement in telugu arj
Rashmika Mandanna:

 వేరే భాషల నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం'లో ముద్దు సన్నివేశంతోనే హిట్ అవ్వడంతో ఆమె సౌత్ ఇండియన్ క్రష్‌గా మారిపోయింది. తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్లు రావడం మొదలైంది. ఇంతలో `కిరిక్ పార్టీ` హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టితో ప్రేమ కూడా మొలకెత్తింది. రింగులు కూడా మార్చుకున్నారు. కానీ అంతలోనే  బ్రేకప్ చెప్పుకున్నారు. 


Rashmika Mandanna

 ఇవన్నీ పాత కథలు.  అవి వాళ్ల వ్యక్తిగత విషయాలు. ఏదేమైనా, ఎంత చేదుగా ఉన్నా తమ మొదటి సినిమా గురించి అందరూ కృతజ్ఞతతో ఉంటారు. రష్మిక మాత్రం ఒకసారి 'కర్లీ టేల్స్' యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు.

Rashmika Mandanna:

కోట్ సైగ చేసి, సినిమా పేరు చెప్పకుండా వ్యంగ్యంగా మాట్లాడారు. కాలేజీలో చదువుతున్నప్పుడే 'కిరిక్ పార్టీ' టీమ్ నా వెంట పడి నటించమని అడిగారని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూకు చాలా వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారని ఫీలింగ్‌లో లెటర్ రాసి సోషల్ మీడియాలో రష్మిక ప్రకటించి తనను తాను సమర్థించుకున్నారు. 

Rashmika Mandanna

 ఆ తర్వాత కొన్ని రోజులకే రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార' భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ వినని పేరు తెచ్చుకుంది. బాలీవుడ్, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీల వాళ్లంతా సినిమాను పొగిడారు.

కానీ, తనకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడి సినిమా గురించి రష్మిక కనీసం మాట్లాడలేదు అని కన్నడిగుల బాధ. దీని గురించి అడిగినప్పుడు రిషబ్ చాలా సహజంగా సమాధానం చెప్పారు. పొరపాటున కూడా రష్మిక గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయలేదు.

రిషబ్‌ శెట్టి

రష్మిక ఎప్పుడు కిరిక్ పార్టీ గురించి తక్కువగా మాట్లాడినా, రిషబ్ కూడా ఆమె స్టైల్‌లోనే ఆమెకు గట్టిగా బుద్ధి చెప్పాడు. గుల్టి డాట్ కామ్ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పేరు చెప్పకుండా ఆమె స్టైల్‌లోనే రిషబ్ శెట్టి సమాధానం ఇచ్చాడు. 
 

రిషబ్‌ శెట్టి

 సమంత, రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి ఈ నలుగురిలో ఎవరంటే ఇష్టం? ఎవరితో నటించడానికి ఆసక్తి ఉంది అని అడిగినందుకు, 'స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత నటీనటుల గురించి నేను ఆలోచిస్తాను. కొత్త నటీనటులతో నటించడానికి ఇష్టపడతాను. మీరు చెప్పిన పేరులో ఈ తరహా (రష్మిక లాగా కోట్ సైగ చేసి చూపించి) నటీమణులు నాకు ఇష్టం లేదు' అని రిషబ్ చెప్పాడు.

రష్మిక మందన్నా, రక్షిత్‌ శెట్టి

 అంతే కాదు, 'సమంత, సాయి పల్లవి నటన చాలా ఇష్టమని రిషబ్ శెట్టి చెప్పారు. సమంతకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు ఎలా అనిపించిందని అడిగినందుకు, 'చాలా బాధపడ్డానని చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. 

 మొత్తానికి రిషబ్ స్టైల్‌కు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిపోయింది, ఆ వీడియో వైరల్ అయ్యాయి. చాలా రోజులు ట్రోల్ పేజీలకు మంచి స్టఫ్‌ దొరికినట్టయ్యింది.  ఇక ప్రస్తుతం రిషబ్‌ శెట్టి ఓ వైపు `కాంతార 2` చేస్తూనే తెలుగులో `జై హనుమాన్‌`లో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే నేడు శనివారం(ఏప్రిల్‌ 5) రష్మిక బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటుంది.ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆమె ప్రస్తుతం `కుబేరా` చిత్రంలో, అలాగే `ది గర్ల్ ఫ్రెండ్‌` చిత్రంలో నటిస్తుంది. 

read  more: రాజశేఖర్‌ హీరోగా పనికిరాడు అని మొహం మీదే చెప్పిన నిర్మాత.. కట్‌ చేస్తే ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్

also read: స్టార్‌ హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్.. సిల్క్ స్మిత పారితోషికం ఎంతో తెలుసా? సమంత, రష్మిక దిగదుడుపే

Latest Videos

vuukle one pixel image
click me!