కార్తీక దీపం వంటలక్క రోజుకు ఎన్ని లక్షలు తీసుకుంటుందంటే? రెమ్యునరేషన్ భారీగా పెంచిన ప్రేమి విశ్వనాథ్

బుల్లితెర ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ కార్తీక దీపం వంటలక్క. చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న ఈ మలయాళ తార.. ప్రస్తుతం కార్తీక దీపం 2తో సందడి చేస్తోంది. అయితే కార్తీక దీపం సీజన్ 1 కి ఇప్పటికీ ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. తెలుగు ఆడియన్స్ లో ఆమె పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ భారీగా పెంచిందట దీప. మరి ఆమె రోజుకు ఎంత వసూలు చేస్తుందంటే? 

Karthika Deepam Vantalakka  Premy Vishwanath  Daily Remuneration: A Shocking Rise in Her Salary in telugu jms
Karthika Deepam Vantalakka Premi Vishwanath

Karthika Deepam Vantalakka  Premy Vishwanath  Daily Remuneration: వెండితెరపై హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెరపై కొంత మంది సీరియల్ తారలకు కూడా అంతే క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా కార్తీక దీపం వంటలక్క అంటే ప్రతీ ఇంట్లో ఒక్కరైనా ఆమె అభిమానులు ఉంటారు. అంతలా ప్రేక్షకుల మనసుల్లో ఆమె నాటుకుపోయింది. ఈ సీరియల్ కూడా టెలివిజన్ రంగంలోనే సంచలనం సృష్టించింది. అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా నిలిచిపోయింది. ఎప్పుడో 2017 లో స్టార్ట్ అయిన కార్తీక దీపం, 2023 లో ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. దాదాపు 1500లకు పైగా ఎపిసోడ్స్ ను కంప్లీట్ చేసుకుంది. 

Also Read: పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?

Karthika Deepam Vantalakka  Premy Vishwanath  Daily Remuneration: A Shocking Rise in Her Salary in telugu jms
Karthika Deepam Vantalakka Premi Vishwanath

ఇక ప్రస్తుతం కార్తీక దీపం సెకండ్ సీజన్ నడుస్తోంది. ఈసీజన్ కు కూడా భారీగా స్పందన రావడంతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈసీరియల్ లో హీరోగా నిరుపమ్ పరిటాల నటిస్తుండగా.. దీప పాత్రలో మలయాళ పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ నటిస్తుంది. ఆమే ఇప్పుడు వంటలక్కగా ఫేమస్ అయ్యింది. కార్తీక దీపం సీరియల్ కు ఈరేంజ్ లో స్పందన రావడంతో ప్రేమి విశ్వనాథ్ కు డిమాండ్ పెరిగిపోయింది. దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. 

Also Read: 3 నెలల్లో 60 ఫ్లాప్ సినిమాలు, 4 హిట్లు మాత్రమే, కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది ?


Karthika Deepam Vantalakka Premi Vishwanath

కార్తీక దీపం సీరియల్ స్టార్టింగ్ లో ఆమె రోజుకు 25 వేలు రెమ్యునరేషన్ తీసుకునేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె రోజుకు లక్షరూపాయలు తీసుకుంటుందట. అంతే కాదు షూటింగ్ ఉన్నన్ని రోజులు హోటల్స్, ఫుడ్, ఆమె అసిస్టెంట్స్ ఖర్చులు కూడా నిర్మాతే భరిస్తున్నట్టు సమాచారం. ఈలెక్కన రోజుకు రెండు లక్షల వరకూ వంటలక్క కోసం ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. ఈసీరియల్ కు వచ్చిన ప్రజాదరణ, రేటింగ్స్  వల్ల లాభాలు గట్టిగానే వస్తున్నాయని, అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఖర్చు విషయంలో వెనకాడటంలేదు అని తెలుస్తోంది. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

Karthika Deepam Vantalakka Premi Vishwanath

ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ విషయంలో నిజం ఏంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె పారితోషికంపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రేమి విశ్వనాథ్ మలయాళ పరిశ్రమకు చెందిన నటి. 2014 లో ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ముందుగా మలయాళ సీరియల్స్ లో నటించిన ఆమె.. అక్కడ ఫేమస్ అవ్వడంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో నాలుగు సీరియల్స్ చేసిన ప్రేమీకి, అక్కడ కంటే తెలుగులోనే పాపులారిటీ ఎక్కువగా వచ్చింది. 

Also Read: రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?

Karthika Deepam Vantalakka Premi Vishwanath

ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా ప్రేమి విశ్వనాథ్ రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన ఆమె..సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ, తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది ప్రేమి. ఇక ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం 2 సీరియల్ లో మాత్రమే నటిస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం 311 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది.

Also Read: అట్లీపై మండిపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీపై స్టార్ డైరెక్టర్ ప్రయోగం చేయబోతున్నాడా ?

Latest Videos

vuukle one pixel image
click me!