ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఏదో ఒక టైమ్ లో, కథలు నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఆ వదిలేసిన కథలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. అయ్యో అనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా బోలెడు బ్లాక్ బస్టర్స్ ను వదిలేశాడట. కథలు నచ్చక రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు కొందరు హీరోలను స్టార్ సెలబ్రిటీలుగా మార్చేశాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా బద్రి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కేరేర్ కు బూస్ట్ ఇచ్చింది. ఈసినిమాతో పనవ్ కు డిఫరెంట్ ఇమేజ్ కూడా వచ్చింది. యూత్ లో ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?
అయితే ఆ తరువాత కూడా పవన్ స్టార్ కు అదిరిపోయే నాలుగు అద్భుతమైన కథలు చెప్పాడట పూరీ జగన్నాథ్. మాస్ మహారాజ్ రవితేజను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు ఇట్లు శ్రాణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ మూడు సినిమా కథలను ముందుగా పవన్ కే వినిపించాడట పూరి. పవన్ నో అనడంతో రవితేజ వరుసగా ఈసినిమాలు చేసి ఇండస్ట్రీలో నిలబడ్డాడు.
Mahesh Babu
అంతే కాదు మరో గోల్డెన్ ఆఫర్ ను కూడా పవర్ స్టార్ మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది. అదేంటంటే.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా కూడా పవన్ కళ్యాన్ కోసం రాసుకున్నాడట పూరి జగన్నాధ్. ఈ కథ కూడా ఆయనకు నచ్చకపోవడంతో.. ఈ కథలో కొన్ని మార్పులు చేసి, మహేష్ బాబు కోసం రెడీ చేశాడు దర్శకుడు. ఇక ఈసినిమా తరువాత మహేష్ బాబు రేంజ్ మొత్తం మారిపోయింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ లో హైయోస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే సినిమా పవన్ చేసుంటే అప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ ఆయన సొంతం అయ్యేవి అనుకున్నారు ఫ్యాన్స్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబోలో తెరక్కిన సినిమా అతడు. ఈ సినిమా కథను కూడా మొదట పవన్ దగ్గరకే వెళ్ళింది. త్రివిక్రమ్ తో మొదటి నుంచి పవన్ కు మంచి అనుబంధం ఉంది. అతడు సినిమా కథను పవన్ కు వినిపించినప్పుడు ఆయన అది వింటూ నిద్రపోయాడట. దాంతో నచ్చలేదేమో అనుకుని త్రివిక్రమ్ మహేష్ బాబుతో అతడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సెన్సెషనల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈసినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడట దర్శకుడు. కాని ఈ కథ తనకు సూట్ అవుతందో లేదో అని అనుమానంతో పవన్ ఈసినిమాను వద్దనుకున్నాడు. కాని ఈమూవీ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఇవి మాత్రమే కాకుండా గోలీమార్, మిరపకాయ్, లాంటి మరెన్నో సినిమాలను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈసినిమాలన్నీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఆయనే ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉండేవారు, పాన్ ఇండియ స్టార్ అయ్యేవాడు అని అంటున్నారు ప్యాన్స్.