మైత్రీ మూవీ మేకర్స్‌తో రిషబ్ శెట్టి డీల్.. నిర్మాతగా స్టార్ హీరో భార్య ప్రగతి..?

Published : Apr 01, 2026, 07:01 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి ఫిలింస్ చేతులు కలిపింది. 'జై హనుమాన్' సినిమా నిర్మాణంలో రిషబ్ దంపతులు పాలుపంచుకోనున్నారు. ఈ చిత్రంతో రిషబ్ భార్య ప్రగతి శెట్టి నిర్మాతగా అడుగుపెడుతున్నారు.

PREV
16
నిర్మాతగా రిషబ్ శెట్టి భార్య..
జై హనుమాన్ సినిమా నిర్మాణంలో రిషబ్ శెట్టి ఫిలింస్ భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు రిషబ్ భార్య ప్రగతి శెట్టి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
26
ప్రగతికి ప్రొడక్షన్ బాధ్యతలు

ఈ సినిమాతో రిషబ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ మరో పెద్ద అడుగు వేస్తోంది. తన సినిమా ప్రయాణంలో ప్రగతికి ప్రొడక్షన్ బాధ్యతలపై మంచి పట్టు వచ్చిందని రిషబ్ అన్నారు.

36
రిషబ్ శెట్టికి సపోర్ట్ గా..

రిషబ్ మాట్లాడుతూ.. " నిర్మాణ బాధ్యతలను సులభంగా నిర్వహించే సత్తా ఆమెకుంది. నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచిన ఆమె, ఇప్పుడు మరిన్ని బాధ్యతలతో ముందుకు వెళ్తోందని''  అన్నారు.

46
సోషల్ మీడియాలో ...
సోషల్ మీడియాలో తన భార్య ప్రగతి, నిర్మాణ సంస్థ పేజీ మినహా అందరినీ రిషబ్ అన్‌ఫాలో చేశారు. గతంలో హోంబళే ఫిలింస్, రుక్మిణి వసంత్‌లను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది.
56
ప్రపంచ కన్నడ సమ్మేళనంలో..
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 2026లో జరగనున్న 'అక్కా ప్రపంచ కన్నడ సమ్మేళనం'కు రిషబ్ శెట్టిని సాంస్కృతిక రాయబారిగా ఎంపిక చేశారు. ఇది అక్కా సంస్థ 25వ వార్షికోత్సవం.
66
ఫిలడెల్ఫియా 2026
'అక్కా ప్రపంచ కన్నడ సమ్మేళనం-ఫిలడెల్ఫియా 2026' సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది. రిషబ్‌ను రాయబారిగా ఎంపిక చేయడంపై ఉత్తర అమెరికాలోని కన్నడ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Read more Photos on
click me!

Recommended Stories