డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ ఎంతో ప్రెస్టేజియస్ గా తెరకెక్కిస్తున్న రామాయణం' సినిమా టీజర్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రామాయణం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. వెండితెరపై మరోసారి రామాయణాన్ని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు.
26
ఏప్రిల్ 2న రామాయణం టీజర్?
మీడియా కథనాల ప్రకారం, రామాయణం సినిమా టీజర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఈ టీజర్ 158 సెకన్లు, అంటే 2 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్.
36
ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు
రిపోర్ట్స్ ప్రకారం, రామాయణం టీజర్‌లో రాముడితో పాటు సీత, లక్ష్మణుల ఫస్ట్ లుక్ కూడా ఉంటుందట. అలాగే రావణుడి చిన్న గ్లింప్స్ కూడా చూపించవచ్చని అంటున్నారు. ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ప్లాన్ చేశారని సమాచారం.
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సౌత్ స్టార్ యష్.. రావణుడి పాత్రలో, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇందిరా కృష్ణన్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, షీబా చద్దా, శోభన, మోహిత్ రైనా వంటి వారు కూడా నటిస్తున్నారు.
56
4000 కోట్ల బడ్జెట్‌తో...
'దంగల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో, దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
66
రెండు భాగాలుగా రామాయణం..
డైరెక్టర్ నితీష్ తివారీ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుంది. ఈ సినిమాను హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్‌తో సహా 50కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.