మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్, పాన్ ఇండియా హీరోగా సినిమాకు 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే కాదు విమానయాన రంగం, పోలో టీమ్ లాంటి ఇతర రంగాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు. రీసెంట్ గా ఏసియన్ తో కలిసి థియేటర్ , మాల్ కూడా కట్టబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడైన రామ్ చరణ్ పేరు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆయన 1370 కోట్ల ఆస్తికి యజమాని.
జూనియర్ ఎన్టీఆర్
'RRR' ఫేమ్ జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తి విలువ రూ. 571 కోట్లు. ఇది కాకుండా ఆయనకు చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ కు వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు, తాను హీరోగా కోట్లు సంపాదిస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా సినిమాకు 100 కోట్ల వరకూ ఆయన తీసుకుంటున్నట్టు సమాచారం.