మురళీ మోహన్ కళ్లు తెరిపించిన స్టార్ కమెడియన్ ఎవరు? ఆయన ఏం చేశాడు ?

Published : Sep 24, 2025, 01:27 PM IST

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఒకరు చెప్పిన ఓ మాట, ఒకప్పటి స్టార్ హీరో మురళీ మోహన్ కళ్లు తెరిపించిందని మీకు తెలుసా? ఆయనే స్వయంగం వెల్లడించిన ఆ నిజం ఏంటి? ఆ కమెడియన్ ఏం చెప్పారు.

PREV
16
మురళీ మెహన్ సక్సెస్ ఫుల్ జర్నీ

టాలీవుడ్ లో సక్సెస్ కు చిరునామాగా ఉన్న నటులతో మురళీ మోహన్ ఒకరు. హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన మురళీ మోహన్, నటుడిగా మాత్రమే కాదు, బిజినెస్ మెన్ గా, రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ పుల్ కెరీర్ ను చూశారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణకలిగిన జీవన శైలి కారణంగా.. 85 ఏళ్లు వచ్చినా ఫిట్ గా ఆరోగ్యంగా మెయింటేన్ చేస్తున్నాడు మురళీ మోహన్. ఇక ఆయన రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

26
టాలీవుడ్ స్టార్ కమెడియన్

టాలీవుడ్ లో ఎక్కువ కాలం కమెడియన్ గా కొనసాగిన అతి తక్కువ మంది స్టార్స్ లో బ్రహ్మానందం ఒకరు. దాదాపు 1500 లకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తనదైన కామెడీ టైమింగ్, తనదైన స్టైల్ తో అలరించాడు. కామెడీ కుటుంబానికే రారాజుగా వెలుగు వెలిగిన బ్రహ్మానందం తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించారు. రెండు తరాల నటులతో కలిసి బ్రహ్మానందం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ఆయన సొంతం. రెమ్యునరేషన్ కూడా ఏ కమెడియన్ అందుకోలేనంతగా బ్రహ్మానందం అందుకున్నారు. ఇక ఓ పది పదిహేనేళ్లు బ్రహ్మానంతం లేకుండా తెలుగు సినిమా రాలేదు. అంత స్టార్ డమ్ సంపాదించిన బ్రహ్మీ, ప్రస్తుంతం అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలు చేస్తూ.. రెస్ట్ తీసుకుంటున్నారు. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి బ్రహ్మానంతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ, సినిమా ఫంక్షన్స్ కు మాత్రం వెళ్తూ ఉన్నారు.

36
బ్రాహ్మానందంతో అనుబంధం

మరుళీమోహన్ ఇండస్ట్రీలో అందరితో చాలా సఖ్యతతో ఉంటారు. ఆయనతో ఎవరికి ఎటువంటి వివాదాలు లేవు. ప్రతీ ఒక్కరిని స్నేహభావంతోనే చూస్తారు. ఈక్రమంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో కూడా మురళీ మోహన్ కు మంచి అనుబంధం ఉంది. షూటింగ్స్ టైమ్ లో కూడా వీరు చాలా క్లోజ్ గా ఉండేవారు. అయితే ఓ విషయంలో బ్రహ్మానంతం నా కళ్లు తెరిపించాడు అని మురళీ మోహన్ ఓ ఇంటర్వయూలో వెల్లడించారు. పూజకు సబంధించి, ఏ దేవుడిని పూజించాలి అనే విషయంలో బ్రహ్మానందం తనకు చెప్పిన మాట జీవితంలో మర్చిపోను అని మురళీ మోహన్ అన్నారు.

46
జయసింహా షూటింగ్ లో జరిగిన సంఘటన

మురళీమోహన్ కు భక్తి ఎక్కువ. ఇంట్లో ఉన్నా,బయటకు వెళ్లినా మురళీ మోహన్ ఖచ్చితంగా పూజ చేస్తారు. ఉదయాన్నే ఏదైనా కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే,. 3 గంటలకు అయినా నిద్ర లేచి స్నానం చేసి, పూజ చేసి వెళ్తాడు. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన జయసింహ సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మానందంతో జరిగిన ఓ సంభాషణ తనలో మార్పు తీసుకువచ్చిందని మురళీ మోహన్ అన్నారు. ఏదేవుడిని పూజించాలి అనే విషయంలో ఆయన చెప్పింది. కరెక్ట్ అనిపించింది అని ఆయన అన్నారు.

56
ఏ దేవుడిని పూజించాలి

మురళీ మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయసింహా షూటింగ్ టైమ్ లో నాకు, బాలయ్యబాబుకు, బ్రాహ్మానందంకు ఎదురెదురుగా కాటేజీలు ఇచ్చారు. ఉదయాన్నే ఎవరి పనులు వారు చేసుకుని షూటింగ్ కు వెళ్లే వారం. ఒక రోజు నాకు బ్రహ్మానందుకు, ఆరోజు షూటింగ్ లేదు. నేను ఉదయం పూజ చేసుకుంటుంటే.. నాతో మాట్లాడటానికి బ్రహ్మానందం నాకాటేజ్ లోకి వచ్చాడు. అప్పుడు నేను పూజ చేస్తున్నారు. నా పూజ చాలా పెద్దగా ఉంటుంది. పెద్దగా స్లోకాలు కూడాచదవుతాను. చాలా లేట్ అయ్యింది. పూజ అయిపోయి నేను వచ్చి ఆయన పక్కన కూర్చున్నాను. మీరు ఏ దేవుడిని పూజిస్తారు అని బ్రహ్మీ అడిగారు. నేను అందరి దేవుళ్లను పూజిస్తాను అని మురళీ మోహన్ అన్నారు.

66
బ్రహ్మానందం చెప్పిన రహస్యం

బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను ఒక్క దేవుడిని మాత్రమే పూజిస్తాను. వెంకటేశ్వరుడిని మాత్రమే పూజిస్తాను. ఏదేవుడి గుడికి వెళ్లినా కూడా వారిలో వెంకటేశ్వరుడినే చూసుకుని మొక్కుతాను, దానికి ఒక లాజిక్ ఉంది. మా ఇంట్లో పనిమనిషి వస్తుంది. ఆమె పది ఇళ్లలో పనిచేస్తుంది. మా ఇంట్లో ఓ గంట పనిచేసి వెళ్తుంది. ఆమెకు కష్టం వస్తే ఈ పది ఇళ్లలో ఎవరో ఒకరు సాయం చేస్తారులే అనుకుంటుంది. కాని ఈ 10 ఇళ్లవారు.. ఎవరో ఒకరు చేస్తారులే అని అనుకుంటారు. అదే మా ఒక్క ఇంట్లో చేస్తే నేను బాధ్యత తీసుకుని సాయం చేస్తాను. దేవుడు కూడా అంతే పదిమందిని పది పేర్లతో పూజిస్తే.. కష్టం వచ్చినప్పడు వేరే దేవుడు సాయం చేస్తాడు లే అని మరో దేవుడు అనుకుంటాడు.. అలా వారిని కన్ఫ్యూజన్ లో పడేసే బదులు ఒకే దేవుడికి ఫిక్స్ అవ్వడం మంచిది కదా. అని బ్రహ్మానంతం మురళీ మోహన్ తో అన్నారు. దాంతో మురళీ మోహన్ కు కూడా ఈ లాజిక్ కరెక్టే కదా అనిపించిందట.

Read more Photos on
click me!

Recommended Stories