Balakrishna: `లారీ డ్రైవర్‌` షూటింగ్‌లో గొడవ.. డైరెక్టర్‌ చేసిన పనికి బాలయ్య రియాక్షన్‌ ఊహకందదు

Published : Sep 24, 2025, 01:09 PM IST

Balakrishna: బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్‌ కలిసి నాలుగైదు సినిమాలు చేశారు. అయితే `లారీ డ్రైవర్‌` సినిమా షూటింగ్‌లో చోటు చేసుకున్న సంఘటన బాలయ్యకి కోపం తెప్పించింది. అందుకు ఆయన ఏం చేశాడంటే? 

PREV
15
బాలయ్యకి తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ తెచ్చిన దర్శకుడు

నందమూరి బాలకృష్ణకి తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి గోపాల్‌. బాలయ్యని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడని చెప్పొచ్చు. 90లో బాలయ్య కెరీర్‌ పీక్‌లో ఉండేదంటే అందుకు దర్శకుడు బి గోపాల్‌ ఓ కారణంగా చెప్పొచ్చు. `లారీ డ్రైవర్‌`, `రౌడీ ఇన్‌స్పెక్టర్‌`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు`, `పల్నాటి బ్రహ్మనాయుడు` వంటి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇందులో నాలుగు బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. ఇవి బాలయ్య కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాలని చెప్పొచ్చు.

25
`లారీ డ్రైవర్‌` షూటింగ్‌లో గొడవ

అయితే దర్శకుడు బి గోపాల్‌కి బాలయ్యతో మొదటి సినిమా `లారీ డ్రైవర్‌` సమయంలోనే పెద్ద ఇష్యూ అయ్యింది. షూటింగ్‌లో పెద్ద రచ్చ అయ్యింది. బాలయ్య చాలా సీరియస్‌ అయ్యారట. చాలా రోజులు మాట్లాడలేదట. ఆయన్ని చూస్తేనే షూటింగ్‌లో ఒక భయానక వాతావరణం క్రియేట్‌ అయ్యేదని, చాలా రోజులు బాలయ్య మాట్లాడలేదట. అసలు ఏం జరిగిందంటే. `లారీ డ్రైవర్‌` చిత్రానికి బి గోపాల్‌ దర్శకుడు. ఏ ఆంజనేయ పుష్పానంద్‌ కథ అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు.

35
కామెడీ తెచ్చిన తంటా

ఈ మూవీ సీరియస్‌గా సాగుతుందని చెప్పి పరుచూరి వెంకటేశ్వరరావు కామెడీ జోడించాడు. అయితే కలెక్టర్‌గా చేసిన శారదపై వచ్చే సీన్లలో కామెడీ రాశారట. ఆయా సీన్లని దర్శకుడు బి గోపాల్‌ చిత్రీకరించారు. బాలయ్య, శారదతోపాటు మెయిన్‌ కాస్టింగ్‌పై ఆయా సీన్లు తీశారు. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఆ రష్‌ చూసి, వద్దు అన్నారట. కలెక్టర్‌ సీరియస్‌గా ఉండే పాత్ర. ఆమెపై ఇలాంటి కామెడీ పెడితే బాగోదు, ఆడియెన్స్ కనెక్ట్ కాదని చెప్పి, మరో వెర్షన్‌రాయించాడట.

45
మళ్లీ రీ షూట్‌ చేయడంతో బాలయ్యకి కోపం

దీంతో ఆయా సీన్లని పక్కన పెట్టి మళ్లీ కొత్తగా షూట్‌ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా హీరో బాలకృష్ణకి చెప్పలేదు దర్శకుడు. టీమ్‌ కూడా ఆ సాహసం చేయలేకపోయింది. దీంతో బాలయ్య సీరియస్‌ అయ్యాడట. మళ్లీ షూట్‌ చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడట. అయితే డెరెక్ట్ గా దర్శకుడు బి గోపాల్‌ ని ఏం అనలేదని, కాకపోతే చాలా రోజులు ఆయనతో మాట్లాడలేదట. షూటింగ్‌ అయిపోయాక పరుచూరి బ్రదర్స్ ఈ విషయాన్ని బాలయ్యకి చెప్పారు. అప్పుడు అయ్యో అలా జరిగిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. కాకపోతే అప్పటికే షూటింగ్‌ అయిపోవడంతో అంతా లైట్‌ తీసుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు బి గోపాల్‌ స్వయంగా వెల్లడించారు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. బేసిక్‌గా బాలయ్య ఇలాంటివి జరిగితే అరవడం, పెద్ద గొడవ చేస్తుంటారని అంటుంటారు. కానీ అందుకు భిన్నంగా బాలయ్య సైలెంట్‌ అయిపోవడం, మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

55
అలా చేస్తే బాలయ్యతో గొడవలే ఉండవు

ఆ విషయంలో విభేదాలు తప్పితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపారు దర్శకుడు బి గోపాల్‌. బాలయ్యకి చెప్పిన టైమ్‌కి షూటింగ్‌ చేయాలని, మార్నింగ్‌ అనుకున్న టైమ్‌ కి షాట్‌ తీయకపోతే ఆయనకు కోపం వస్తుందని, అందుకే మేం అనుకున్న టైమ్‌కి షాట్‌ రెడీ చేసేవాళ్లమని, దీంతో అంతా సాఫీగా సాగిపోయిందన్నారు. మొదటి షాట్‌ తీశాక మధ్యలో గ్యాప్‌ వచ్చినా ఆయన పట్టించుకోరని చెప్పారు. సెట్‌లో బాలయ్య బాబు ఎంతో సరదాగా ఉంటారని, జోకులు వేస్తూ నవ్విస్తుంటారని తెలిపారు. బాలకృష్ణ, విజయశాంతి జోడీగా నటించిన `లారీ డ్రైవర్‌` మూవీ 1990 డిసెంబర్‌ 21న విడుదలైన మంచి విజయం సాధించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories