CM Revanth Reddy, Allu Arjun,
ప్రస్తుతం తెలంగాణాలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టుగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ వివాదంతో పరిస్థితులు వేడెక్కాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తరువాత జరుగుతున్న పరిణామాలు, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, రాత్రంతా ఆయన జైల్లో ఉండటం, రిలీజ్ అయిన తరువాత జరిగిన ఎమోషనల్ సిచ్యూవేషన్స్, ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి పరామర్శించడం లాంటివి మరింత హీట్ ను పెంచాయి. అంతే కాదు కోర్టులో అల్లు అర్జున్ కేసు ఇంకా అయిపోలేదు పెండింగ్ లోనే ఉంది.
Also Read: ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?
అటు సంధ్యా థియేటర్ ఘటనలో తల్లి మరణించగా.. కొడుకు శ్రీతేజ ఇంకా చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈక్రమంలో తాజాగా అసెంబ్లీలో MIM ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఈ విషయంలో స్పందించారు. బన్నీపై మండిపడిన ఆయన రేవంత్ ను క్లారిటీ ఇవ్వాలన కోరారు.
ఇక రేవంత్ అల్లు అర్జున్ చెప్పినా వినకుండా ఇలా చేశారంటూ వివరించారు. ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తన వెర్షన్ వివరించారు. ఇదంతా తాజాగా జరిగింది. అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఇండస్ట్రీలో భయం మొదలయ్యింది.
సినిమాలకు బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ రేట్లు పెంచేది లేదు అంటూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పెద్ద సినిమాలకు గుబులు మొదలయ్యింది. ప్రస్తుతం ఇండియా అంతటా చూసుకుంటే.. టాలీవుడ్ నుంచి మాత్రమే పాన్ ఇండియా సినిమాలు..భారీ బడ్జెట్ సినిమాలు బయటకు వస్తున్నాయి.
అవి హిట్ అవ్వాలన్నా.. రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించాలన్నా.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడం చాలా ముఖ్యం. అలా చేయకపోతే కలెక్షన్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ముందు ముందు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేదిచెప్పలేం కాని.. రిలీజ్ కు చాలా దగ్గరలో ఉన్న గేమ్ ఛేంజర్ కు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈ సారి చాలా త్వరగా స్టార్ట్ కాబోతున్న రియాల్టీషో.. ఎప్పుడంటే..?
Game Changer
ఇంకో 20 రోజుల్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈమూవీ రిలీజ్ కు ఉంది. అయితే పుష్ప2 ఇప్పటికే 1500 కోట్లు కలెక్ట్ చేసి.. 2000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతోంది. కాగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ సినిమా కూడా అంతకు మించి కాకపోయినా.. 1000 కోట్లు అయినా దాటించాల్సి ఉంది. మరి అంత కలెక్షన్లు రావాలంటే తెలంగాణాలో బెనిఫిట్ షోలు లేకపోతే.. కష్టంగా మారే అవకాశం ఉంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ ఒక్క సినిమాకే కాదు.. తరువాత వచ్చే పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈక్రమంలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది.
ముందు తన కొడుకు రామ్ చరణ్ సినిమా కోసం మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కోసం ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కోర్డుల ద్వారా తేల్చుకుంటారా..? లేక ప్రభుత్వంతో గొడవ పెట్టుకోకుండా.. చర్చల ద్వారా పరిష్కరించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: లేడీ గెటప్ లో ఎన్టీఆర్, స్టార్ కమెడియన్ తో డ్యూయోట్ కూడా.. ఎవరా కమెడియాన్, ఏంటా సినిమా..?
ప్రస్తుతం ఈ హీట్ మూమెంట్ లో ప్రభుత్వాన్ని కదిలించడంకష్టమనే చెప్పాలి. రామ్ చరణ్ సినిమా వరకూ కూడా ఇది పరిష్కారం అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. హస్పటిల్ లో ఉన్న శ్రీతేజ పరిస్థితి మెరుగుపడి. అతను డిశ్చార్జ్ అయితే .. చిన్నగా ఇండస్ట్రీ కదిలే ఛాన్స్ ఉంది.
లేదంటే కొంత సమయం తీసుకుని అయినా ప్రభుత్వంతో ఈ విషయంలో ఇండస్ట్రీ చర్చలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయంల్ మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేస్తారనడంలో ఎటువంటిసందేహం లేదు.
దాసరి పోయిన తరువాత టాలీవుడ్ కు వచ్చిన ఎన్నో సమస్యలను ఆయన ముందుండి పరిష్కరించారు. దాంతో ఈ ప్రాబ్లమ్ కూడా మెగాస్టార్ ముందేసుకుని చర్చిస్తారని తెలుస్తోంది. కానిఎటు పోయి ఎటు వచ్చినా.. తెలంగాణాలో గేమ్ ఛేంజర్ కు మాత్రం పెద్ద దెబ్బ తప్పదని తెలుస్తోంది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
అసలే శంకర్ డైరెక్షన్ పై భయంగా ఉన్న ఫ్యాన్స్ కు ఈ విషయం జీర్ణించుకోలేని సమస్యగా మారింది. మరి సంక్రాంతి వరకూ ఏమైనా అద్భుతాలు జరుగుతాయా..? రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమౌతుంది. పుష్ప2 కలెక్షన్లకు దగ్గరగా వచ్చి పరువు నిలబెట్టుకుంటుందా..? ఒక వేళ ఈ సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి..? చూడాలి మరి.