విక్టరీ వెంకటేష్ ఫస్ట్ టైమ్ టాక్ షోకి వస్తున్నారు. ఆయన ఒకప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిట్ చాట్‌ల్లోనూ పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ ఆయన ఒక టాక్ షోకి రాలేదు. తన కెరీర్‌లోనే మొదటిసారి టాక్ షోకి వస్తున్నారు. అది కూడా బాలయ్య టాక్ షోకి కావడం విశేషం. వెంకటేష్, బాలయ్య కాంబినేషన్‌లో ఈ షో ఉండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
aha
వెంకటేష్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి వెళ్లబోతున్నారు. వెంకీ ఇలాంటి టాక్ షోకి వెళ్లడం ఇదే మొదటిసారి. రేపు ఆదివారం వెంకటేష్‌పై ఈ ఎపిసోడ్‌ని చిత్రీకరించబోతున్నారు. వెంకటేష్, బాలకృష్ణ మధ్య ఎలాంటి కన్వర్జేషన్ జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది.
వెంకటేష్ ప్రస్తుతం `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్.. బాలయ్య షోకి వెళ్తున్నారని సమాచారం.
అయితే సంక్రాంతికి బాలయ్య నటించిన సినిమా `డాకు మహారాజ్` కూడా విడుదల కాబోతుంది. దీనికి బాబీ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఇందులో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో బాలయ్య సినిమాకి కూడా ప్రమోషన్స్ చేయాల్సి ఉంది.