సెకండ్‌ మ్యారేజ్‌ కి నేను రెడీ.. రేణు దేశాయ్‌ కామెంట్స్ వైరల్‌, ఎప్పుడు చేసుకుంటుందంటే?

Published : Jul 07, 2025, 07:07 AM IST

పవన్‌ కళ్యాణ్‌ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్‌ ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న ఆమె రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో వెల్లడించారు. 

PREV
16
రేణు దేశాయ్‌ సెకండ్‌ మ్యారేజ్‌ పై క్లారిటీ

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌తో విడిపోయి దాదాపు 13ఏళ్లు అవుతుంది. సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. తన కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆధ్యాల బాగోగులు చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

అయితే రెండో పెళ్లికి సంబంధించిన ఆమె తరచూ స్పందించింది. ఈ సందర్బంగా ఓ క్లారిటీ ఇచ్చింది. తాను సెకండ్‌ మ్యారేజ్‌ ఎప్పుడు చేసుకుంటుందో తెలిపింది.

26
రెండో పెళ్లికి తాను రెడీనే

రెండో పెళ్లి చేసుకోవడానికి తాను రెడీనే అని చెప్పింది. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. మ్యారేజ్‌ చేసుకోవడానికి మరికొన్నిరోజులు వెయిట్‌ చేస్తుందట.

 తాను మ్యారేజ్‌ చేసుకోవడానికి రెడీనే అని, కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది‌. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది రేణు దేశాయ్‌.

 అయితే అప్పటి వరకు వెయిట్‌ చేయడానికి, ఇన్నాళ్లు మ్యారేజ్‌ చేసుకోవడానికి కారణం ఆమె వెల్లడించింది. 

36
పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోలేదు

తన పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోలేదని చెప్పింది రేణు దేశాయ్‌. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి కారణం చెబుతూ, 

ఆ సమయంలో తమ పిల్లలు అకీరా, ఆద్య ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్నారు. వారికి కేర్ టేకర్‌ కావాలి. ఆ టైమ్‌లో వారికి తోడు కావాలి. తాను పెళ్లి చేసుకుంటే తన భర్తతో టైమ్‌ కేటాయించాల్సి వస్తుంది. 

ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రి దూరంగా ఉంటున్నారు, తాను కూడా దూరమైతే వాళ్లు ఒంటరి ఫీలింగ్‌ని ఫేస్‌ చేయాల్సి వస్తుంది. ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో మ్యారేజ్‌ చేసుకోలేదని చెప్పింది రేణు దేశాయ్‌.

46
రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకునేది అప్పుడే

`మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు వాళ్లకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం వస్తుంది. వారితోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేస్తారు.

 పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్‌ అవరు, కేవలం సపోర్టింగ్‌ కోసమే పేరెంట్స్ అవసరం అవుతారు, కానీ రోజంతా పేరెంట్స్ అవసరం లేదు. 

అప్పుడు నేను ఫ్రీ అవుతాను, తన మ్యారేజ్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతాను. అందుకే ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తున్నాను అని తెలిపింది రేణు దేశాయ్‌. 

మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నాకు మ్యారేజ్‌ లైఫ్‌ కావాలి, అందరిలా నేను కూడా మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నా` అని చెప్పింది రేణు దేశాయ్‌.

56
నన్ను మ్యారేజ్‌ చేసుకోమని అకీరా, ఆధ్య చెబుతుంటారు

`నా పెళ్లికి సంబంధించి పిల్లలు కూడా పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్లే `మమ్మి మ్యారేజ్‌ చేసుకో`మంటున్నారు, నీవు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో, ఎవరి కేరింగ్‌ని ఇష్టపడతావో వాళ్లని పెళ్లి చేసుకో మమ్మి అంటారు. 

తాను సిక్‌గా ఉన్నప్పుడు వాళ్లు ఫీలవుతుంటారు. మ్యారేజ్‌ విషయంలో వాళ్లు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటారని చెప్పింది రేణు దేశాయ్‌. 

ఐడ్రీమ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. మరి ఈ లెక్కన మరో రెండు మూడేళ్లలో రేణు దేశాయ్‌ మరో జీవితాన్ని స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు.

66
`బద్రి` సినిమాతో ఒక్కటైన పవన్‌, రేణు దేశాయ్‌

`బద్రి` సినిమా సమయంలో పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. ఆ సమయంలోనే అకీరా నందన్‌ జన్మించారు. ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకున్నారు. 

కూతురు ఆధ్య జన్మించింది. ఆమె పుట్టిన రెండేళ్లకి విడాకులు తీసుకున్నారు. పవన్‌ రష్యా నటి అన్నా లెజినోవాని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు పొలేనా, కొడుకు మార్క్ శంకర్‌ జన్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories